గురువారం ఈ ఒక్క పని చేస్తే.. సమస్యలే ఉండవు..!
గురువారం రోజున ఒక్క పని చేయడం వల్ల ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Dhan Prapti Vastu upay
ప్రతి ఒక్కరికీ ఏవేవో సమస్యలు ఉంటాయి. కొందరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. మరి కొందరికి ఉద్యోగం, పెళ్లి కాకపోవడం ఇలా ఏ సమస్య ఉన్నా సరే.. కేవలం గురువారం రోజున ఒక్క పని చేయడం వల్ల ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపును హిందూ ధర్మశాస్త్రంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ పసుపును ఉపయోగించి కొన్ని పనులు చేయడం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయట. సనాతన ధర్మం ప్రకారం గురువారాన్ని విష్ణుమూర్తికి సంబంధించినదిగా భావిస్తారు. అంతేకాకుండా. గురు గ్రహానికి కూడా సంబంధించినది కూడా. అందుకే... ఈ రోజున ఎవరికీ తెలీకుండా పసుపును దానం చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు దక్కుతాయట.
గురువారం రోజున గురు గ్రహాన్ని బలపరచడానికి ఈ పసుపు రెమిడీని ఫాలో అయితే చాలు. పసుపు దానం చేయడం వల్ల గురు గ్రహం బలపడి.. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
మీరు ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే... పసుపు ముద్దను దానం చేయాలి. ఇలా దానం చేయడం వల్ల డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంట్లో సంపద నిలపడుతుంది. మీ అప్పులు కూడా తీరుతాయి. మీ డబ్బులు ఎవరి దగ్గరైనా మిగిలిపోయినా.. ఆ డబ్బులు కూడా..మీ దగ్గరకు వచ్చేస్తాయి.
turmeric
దాంపత్య జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నా.. అవి కూడా తీరిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దంపతుల మధ్య బంధం బలపడుతుంది. వారి మధ్య ప్రేమ పెరుగుతుంది. జీవితాంతం సంతోషంగా ఉంటారు.
turmeric
పసుపు ముద్దను గురువారం దానం చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. కేవలం ఇంట్లో మాత్రమే కాదు.. మనిషిలో ఉన్న నెగిటివిటీ కూడా పోతుంది. పాజిటివిటీ పెరుగుతుంది. కుటుంబంలో కూడా సంతోషం కూడా పెరుగుతుంది. ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి.