MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Zodiac signs: ఈ రాశులవారిలో ఏదో ఓ మ్యాజిక్ ఉంది.. ఎవరినైనా ఇట్టే ప్రేమలో పడేస్తారు..!

Zodiac signs: ఈ రాశులవారిలో ఏదో ఓ మ్యాజిక్ ఉంది.. ఎవరినైనా ఇట్టే ప్రేమలో పడేస్తారు..!

కొన్ని రాశులవారు ఎవరినైనా చాలా తొందరగా ఆకర్షించగలరు. వారిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Aug 07 2025, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
zodiac signs
Image Credit : Asianet News

zodiac signs

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ప్రేమలో పడటం చాలా సహజం. కొందరు తమ ప్రేమను గెలిపించుకోవడానికి చాలా తిప్పలు పడుతుంటారు. కానీ, కొందరు మాత్రం చాలా ఈజీగా లవ్ లో సక్సెస్ అవ్వగలరు. ముఖ్యంగా కొన్ని రాశులవారు ఎవరినైనా చాలా తొందరగా ఆకర్షించగలరు. వారిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఎవరినైనా చాలా సింపుల్ గా ప్రేమలో పడేయగలరు. మరి, ఆ రాశులేంటో చూద్దామా....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1.వృషభ రాశి...
Image Credit : Asianet News

1.వృషభ రాశి...

వృషభ రాశివారు చాలా శాంతమైన స్వభావం కలిగి ఉంటారు. వీరు చాలా నమ్మకంగా ఉంటారు. వీరి మనసు చాలా మంచిది. వీరు అందరితోనూ చాలా ప్రేమగా మాట్లాడతారు. వీరు మాటలకు ఎవరైనా ఆకర్షితులైపోతారు. వీరి మాటలకు ఎవరైనా చాలా సులభంగా ప్రేమలో పడిపోగలరు. వీరి నుంచి, వీరి మాటల నుంచి దూరంగా వెళ్లిపోవాలని ఎవరికీ ఉండదు.

Related Articles

Related image1
Zodiac signs: ఈ రాశుల వారిని ప్రేమిస్తే.. మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు జాగ్రత్త..!
Related image2
Zodiac signs: వీరికి ఆవేశం చాలా ఎక్కువ, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నిమిషం కూడా ఆలోచించరు
37
2.మిథున రాశి...
Image Credit : Asianet News

2.మిథున రాశి...

మిథున రాశివారి మాటల్లో చాకచక్యం ఉంటుంది. ఏదైనా విషయాన్ని నవ్వుతూ చెప్పగలరు. వీరికి తొందరగా కోపం రాదు. ఎదుటివారికి అర్థమయ్యేలా ఓపికగా చెప్పగలరు. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ. ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. వీరి తెలివి తేటలు, చురుకుదనంతో అందరినీ  ఆకట్టుకుంటారు. కొత్త కొత్త విషయాలను తెలుసుకొని అందరికీ చెబుతూ ఉంటారు. అందరినీ నవ్విస్తూ, తమ మాటలతో ఆకట్టుకోగలరు. అందుకే.. చాలా తొందరగా వీరు ఎవరినైనా ప్రేమలో పడేయగలరు.

47
3.సింహ రాశి...
Image Credit : Asianet News

3.సింహ రాశి...

సింహ రాశివారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ధైర్యవంతులు కూడా. దేనికీ తొందరగా భయపడరు. అయితే..వీరి మాటలు, వీరి ధైర్య సహాసాలకు ఎవరైనా పడిపోవాల్సిందే. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అందరినీ ఆకట్టుకుంటారు. వారు ఎక్కడ ఉన్నా అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. వీరి టాలెంట్ అందరినీ ఆకర్షించేలా చేస్తుంది. వీరి ప్రేమలో ఎవరైనా ఈజీగా పడిపోతారు.

57
4.తుల రాశి...
Image Credit : Asianet News

4.తుల రాశి...

తుల రాశివారు న్యాయానికి మారుపేరు. వీరు ప్రతి విషయంలో చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఇతరులకు చాలా బాగా మర్యాద ఇస్తారు. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. వీరి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతరుల భావాలను చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. వీరి ప్రవర్తన అందరికీ నచ్చేస్తుంది. అందుకే, వీరి ప్రేమలో చాలా ఈజీగా పడిపోతారు.

67
5.వృశ్చిక రాశి..
Image Credit : Asianet News

5.వృశ్చిక రాశి..

వృశ్చికరాశివారు లోతైన భావాలు, గాఢమైన విధేయత కలిగి ఉంటారు. వీరి రహస్యమయమైన స్వభావం, ఆత్మీయ చూపులు ఇతరులలో ఆసక్తి రేకెత్తిస్తాయి. వీరి సీరియస్, భావోద్వేగపూర్ణ వైఖరి వారికి మరింత ప్రత్యేకత ఇస్తుంది. అందుకే వీరు అందరికీ తెగ నచ్చేస్తారు.

77
6. మీన రాశి..
Image Credit : Asianet News

6. మీన రాశి..

మీనం రాశివారు దయ, కరుణ, సున్నితమైన స్వభావానికి ప్రతీక. కళాత్మక ప్రతిభ, ఆప్యాయత, సహాయం చేయాలనే మనసు వీరిని అందరికీ ఇష్టపడేలా చేస్తుంది. ఇతరుల బాధలను కూడా తమ బాధలుగా భావిస్తారు. అదే వీరిలోని ప్రత్యేకత. ఈ ప్రత్యేకత కారణంగా వీరి ప్రేమలో అందరూ చాలా ఈజీగా పడిపోతారు.

ఫైనల్ గా...

ఈ ఆరు రాశుల వారు తమ ప్రత్యేక గుణాలు, ఆప్యాయత, సానుకూల వైఖరితో ఎక్కడ ఉన్నా సహజంగానే ఇతరుల హృదయాలను గెలుచుకుంటారు. మీరు కూడా ఈ రాశులలో ఒకరైతే, మీ ఆకర్షణ, ప్రేమపూర్వక స్వభావం మీకెప్పుడూ ప్రత్యేకతనూ, అందరి మనసులో స్థానం పొందగలుగుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Recommended image2
Saubhagya Yoga: సౌభాగ్య యోగంతో సెప్టెంబర్‌లో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే!
Recommended image3
Guru Gamanam: కేతు నక్షత్రంలోకి గురు గమనం.. ఈ రాశులకు కుబేర యోగం, డబ్బే డబ్బు..!
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల వారిని ప్రేమిస్తే.. మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు జాగ్రత్త..!
Recommended image2
Zodiac signs: వీరికి ఆవేశం చాలా ఎక్కువ, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నిమిషం కూడా ఆలోచించరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved