Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర ధనుస్సు రాశి ఫలితాలు
శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన ధనస్సు రాశి ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు ధనస్సు రాశి వారికి సంబందించిన మాస, వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఆధారంగానూ ఫలితాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
Sagittarius
ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1) నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే) ఆదాయం:-11 వ్యయం:-5 రాజపూజ్యం:-7 అవమానం:-5
Sagittarius
ఈ రాశి వారికి గురుడు మే1-5-24 వరకు పంచమ స్థానంలో సువర్ణమూర్తి గా సంచరించి తదుపరి సంవత్సరాంతం షష్ట స్థానంలో రజత మూర్తి గా సంచారం
శని ఈ సంవత్సరమంతా తృతీయ స్థానంలో లోహ మూర్తి గా సంచారం.(శని సంచారం అనుకూలం)
రాహు ఈ సంవత్సరమంతా చతుర్ధ స్థానంలో సువర్ణమూర్తి గా సంచారం
కేతువు ఈ సంవత్సరమంతా రాజ్య స్థానంలో సువర్ణమూర్తి గా సంచారం.(అనుకూలం)
మే నుంచి షష్టమ స్థానంలో సంచారం ఈ సంచారం అనుకూలం కాదు.వ్యవహారాల్లో ఆతురత పెరుగుతుంది.పనులు శ్రమ అధికంగా ఫలితం తక్కువగా ఉంటుంది.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబంలో ఉద్యోగాలు చికాకులు.అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.వ్యవహారాల్లో బుద్ధి చాతుర్యం పెరుగుతుంది.దాంపత్య జీవితం బాగుంటుంది.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందగలరు.దగ్గర బంధువులు నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.అకారణంగా స్త్రీల తో కలహాలు రాగలవు.స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు మరియు వాహన గృహ భూ కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.ఉద్యోగాలలో అభివృద్ధి.సంఘంలో మంచి స్థానం.మీ యొక్క తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది.ప్రతి పనిలోనూ ముందడుగు వేస్తారు.ఉద్యోగులకు అన్ని విధాలుగా బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్లు వలె ఖర్చు అవుతుంది.ఈ సంవత్సరం కళాకారులు కు సామాన్యంగా ఉంటుంది.ఎన్ని అవకాశాలు వచ్చినా ఆదాయం అంతంత మాత్రమే లభిస్తుంది.వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ధన లాభం పొందగలరు.విద్యార్థులకు బాగుంది. జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాలు మెరుగుపడతాయి.గట్టి ప్రయత్నముచే నూతన గృహ భూ కొనుగోలు చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి.
Sagittarius
మూల నక్షత్రం వారికి
గురుడు 30-05-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి 13-6-24 వరకు క్షేమతార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి ప్రత్యక్ తారా లో సంచారం.
శని 3-10-24 వరకు నైధనతార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి సాధనతార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు నైధన తార లో సంచారం.
రాహు 7-7-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం మిత్ర తార లో సంచారం
కేతువు 11-11-24 వరకు క్షేమ తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం విపత్తార లో సంచారం
పూ.షాఢ నక్షత్రం వారికి
గురుడు 13-06-24 వరకు సంపత్తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి విపత్తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి క్షేమతార లో సంచారం
శని 3-10-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి ప్రత్యక్తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు సాధన తార లో సంచారం.
రాహు7-7-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం మిత్ర తార లో సంచారం.
కేతువు 11-11-24 వరకు విపత్తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం సంపత్తార లో సంచారం
ఉ.షాఢ నక్షత్రం వారికి
గురుడు 13-06-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి 13-6-24 నుంచి సంపత్తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి విపత్తార లో సంచారం.
శని 3-10-24 వరకు ప్రత్యక్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి క్షేమ తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు ప్రత్యక్తార లో సంచారం.
రాహు 7-7-24 వరకు నైధనతార లో సంచారం తదుపరి సంవత్సరాంతం సాధన తారలో సంచారం.
కేతువు 11-11-24 వరకు సంపత్తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం జన్మతారలో సంచారం.
(ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు రాహు సంచారం అనుకూలం కాదు కావున ఈ రాశి వారు ప్రతి మాస శివరాత్రి కి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమ పూజ చేయడం మంచిది.)
Astro
ఏప్రిల్
చేసే పనులు ఎందుకు దృష్టి పెట్టలేక పనులు మధ్యలో నిలిచిపోవును.సమయం కానీ సమయంలో భోజనం చేయవలసి వస్తుంది.ఆదాయ మార్గాలు తగ్గుతాయి. అనవసరమైన ఖర్చులు విపరీతం గా పెరుగుతాయి.ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి.వ్యవహారాల్లో ధైర్యంగా ఒక ప్రణాళిక పరంగా వ్యవహరించుకోవాలి.ప్రభుత్వం నుంచి సన్మాన సత్కారాలు జరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మే
చేసే పనులలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఖర్చుల విషయంలో నియంత్రణ ధోరణి అవలంబించు కోవాలి.పనులు మందకొడిగా సాగుతాయి.చెడు అలవాట్ల కు చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.విద్యార్థులు కళాశాల ప్రవేశ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.శత్రువు వర్గం నుండి భయం.వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.వ్యతిరేకుల నుంచి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని సందర్భానుసారంగా ఎదుర్కొంటారు.
Sagittarius Zodiac
జూన్
కుటుంబంలో ఎవరి దారి వారిది గా ఉంటుంది.చేసే పనుల్లో శారీరక శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది.ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.. కుటుంబ సభ్యుల విషయంలో సంయమనం పాటించాలి.ఆర్థిక ఇబ్బందులు పెరిగి అప్పు చేయవలసి వచ్చును.పరామర్శలు చేయవలసి వస్తుంది.సోదరి వర్గంతో చిన్న చిన్న తగాదాలు ఏర్పడవచ్చు.ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం.
జూలై
ఉద్యోగాలు లో అంకితభావంతో వ్యవహరిస్తారు.ధనాదాయం బాగుంటుంది.అన్ని వైపుల నుంచి లాభాలు పొందుతారు.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.రోగాల నుండి రుణాల నుంచి విముక్తి పొందుతారు.ద్వేషించే వారితోనే సుముఖత ఏర్పడుతుంది.శ్రమకు తగిన ప్రతిఫలం లేదా అధిక ఆదాయం ఉంటుంది.శారీరక మానసిక సుఖాలకు కొరత ఉండదు.సమాజంలో గౌరవం మర్యాదలు ఎక్కువగా ఉంటాయి.శత్రువులు మీ విషయంలో అణిగిమణిగి ఉంటారు.
ఆగస్టు
ఈనెల గ్రహ సంచారం అనుకూలత అంతగా లేదు. అని వ్యవహారాలు ఆలస్యం అవుతాయి.కుటుంబ వ్యవహారాలు కు ప్రాధాన్యత ఇవ్వాలి. మాసాంతంలో చేతిలో సరిపడినంత ధనం ఉండదు.భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు రాగలవు. బంధుమిత్రులు వల్ల అపకారం జరిగే అవకాశం.అనవసరమైన విషయాలు లో పట్టుదల ప్రదర్శించడం మంచిది కాదు. ఊహించని విధంగా ఖర్చు లు ఎదురవుతాయి.అప్రయత్నంగా ధన నష్టాలు కలుగుతాయి.
సెప్టెంబర్
అన్ని రంగాల వారికి చేయు వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉంటుంది. హుషారుగా ఆనందంగా గడుపుతారు. ప్రతి చిన్న విషయానికి వ్యతిరేకంగా ఉండటం వల్ల కోపం రావడం అనవసరమైన గొడవలు సంభవించును.మధ్యవర్తిత్వం చేయుట మంచిది కాదు.సంతానం ద్వారా ఆదాయం బాగుంటుంది.చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ పూర్తి అవుతాయి.ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.పోటీ తత్వానికి దూరంగా ఉండటం మంచిది.
అక్టోబర్
అన్ని విషయాల్లోనూ అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఆర్థికంగా చిన్నపాటి వెసులుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.ఇతరుల విషయంలో హామీలకు దూరంగా ఉండాలి.తరచూ మానసిక ఒత్తిడికి లోనవుతారు.నూతన పెట్టుబడులు తగ్గించు కోవడం మంచిది.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.స్త్రీ మూలకంగా ధనం ఖర్చవుతుంది.ఊహించిన సంఘటనలు ఎదురవుతాయి.అనవసరంగా కొన్ని పనులు చేయడం వల్ల ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు.కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి.
నవంబర్
ఈ నెలలో కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటాయి. కొన్ని సమస్యలు తీవ్రమవుతాయి.ఏ పని చేయ బుద్ధి కాదు.ప్రతి చిన్న విషయంలో వ్యతిరేకతలు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.ఆరోగ్య సమస్యలు రాగలవు. సంతానంతో కూడా ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది.తీర్థయాత్రలు చేస్తారు. అనవసరపు పట్టుదలను వదలాలి.వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.ఆరోగ్య నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
డిసెంబర్
అన్ని విషయాల్లోనూ తగు జాగ్రత్తలు పాటించాలి.ఏ విషయంలో అయినా శారీరక మానసిక ఇబ్బందులు ను అధిగమిస్తారు.సహోద్యోగుల విషయంలో సాటివారితో ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.క్రయ విక్రయాలకు ఈ మాసమంతా దూరంగా ఉండాలి.ఇంట్లోని వారికి ఆరోగ్య భంగం.అధిక శ్రమ వలన ధనాదాయం లభిస్తుంది.సంఘాల్లో కీర్తి ప్రతిష్టలు సామాన్యంగా ఉంటాయి.
జనవరి
చేసే పనుల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ పట్టుదలతో చేస్తే ఫలితం ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలంగా ఉంటాయి.విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు నియమాలు పాటించాలి.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.దూరపు ప్రయాణం చేయవలసి వస్తుంది.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.తలపెట్టిన కార్యాల్లో విజయం సాధిస్తారు.శత్రువులు మిత్రులు లై సహాయ సహకారాలు అందిస్తారు.
ఫిబ్రవరి
తలపెట్టిన కార్యక్రమాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి.గృహాధి నిర్మాణ పనులు కలిసి వస్తాయి.గృహంలో శుభ కార్యక్రమాలు జరుగును.బంధు వర్గం తో కలిసి ఆనందంగా గడుపుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.ఆరోగ్యం అనుకూలిస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.ఆకస్మికంగా కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి.అన్ని వర్గాల వారికి ఈ మాసం అంతా ఆర్థికంగా బాగుంటుంది. క్రయవిక్రయాల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు పాటించుట మంచిది.
మార్చి
చేయు వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.అన్ని వ్యవహారాల్లో విజయం ఉంటుంది.ఆరోగ్యం బాగుంటుంది.ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు.ఇష్టమైన వ్యక్తులు ను కలుసుకుంటారు.ఉద్యోగులకు స్థాన మార్పులు లేదా గృహ మార్పులు కలగవచ్చు. విద్యార్థులకు అనుకూలమైన సమయం.నూతన పరిచయాలు లాభిస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.