ఈ రాశివారి జీవితంలో ఉన్న అతిపెద్ద సీక్రెట్ ఇదే..!
కొందరు మాత్రం... తమకు దగ్గరగా అనిపించిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కాగా.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు ఎలాంటి రహస్యాలు దాచిపెట్టారో చెప్పేయవచ్చట. అవేంటో చూద్దాం..

SECRET
మనుషులన్నాక ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. కొందరు ఆ సీక్రెట్స్ ని తమలోనే దాచుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం... తమకు దగ్గరగా అనిపించిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. కాగా.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారు ఎలాంటి రహస్యాలు దాచిపెట్టారో చెప్పేయవచ్చట. అవేంటో చూద్దాం..
1.మేష రాశి..
ఈ రాశివారు చేసిన తప్పులను అంగీకరిస్తారు. కానీ.. గెలవడానికి తమకు ఎవరూ సహాయం చేయరు అనుకున్నప్పుడు కచ్చితంగా మోసం చేసి గెలవాలని అనుకుంటారు. ఈ విషయాన్ని ఎవరికీ బయటకు చెప్పకుండా.. తమలోనే దాచుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పరు.
2.వృషభరాశి..
ఈ రాశివారు బయటకి చాలా ఆనందంగా ఉన్నట్లు.. తాము చాలా కూల్ పర్సన్ లాగా.. కనిపిస్తుంటారు. కానీ నిజానికి వీరు లోలోపల అసురక్షితంగా , తమై తాము నమ్మకంగా కూడా ఉండలేరు. ఈ విషయాన్ని బయటపెట్టకుండా సీక్రెట్ గా ఉంచుతుంటారు.
3.మిథున రాశి..
ఈ రాశివారు అందరిముందూ తెగ నటిస్తూ ఉంటారు. మనసులో విషయాన్ని అస్సలు బయటపెట్టరు. ఎక్కడ తమ గురించి అందరికీ తెలిసిపోతంుదా అని చాలా జాగ్రత్తగా ఉంటారు. క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర కూడా నటిస్తూ నే ఉంటారు. తమ నిజ స్వరూపాన్ని ఎవరికీ చూపించడానికి ఇష్టపడరు.
4.కర్కాటక రాశి..
ఈ రాశివారు అందరితో స్నేహంగా ఉన్నట్లు నటిస్తారు. కానీ.. నిజంగా అలా ఉండరు. ఫ్రెండ్స్ లో కొందరు అసలు వారికి నచ్చరు. కానీ ఆ విషయాన్ని చెప్పకుండా నటిస్తూ ఉంటారు.
5.సింహ రాశి..
ఈ రాశివారికి అసూయ ఎక్కువ. అందరి పట్ల అసూయ పెంచుకుంటూ ఉంటారు. అయితే.. ఈ విషయాన్ని బయటకు తెలీకుండా నటిస్తూ ఉంటారు. ఎవరికి ఏది ఉన్నా.. దానిని చూసి అసూయపడుతుంటారు. అది తమకు లేదు అని ఫీలౌతూ ఉంటారు.
6.కన్య రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ తప్పుడు రివ్యూలు ఇస్తూ ఉంటారు. పక్కవారిని మోసం చేయాలని అనుకుంటూ ఉంటారు. అది మంచిది కానప్పటికీ.. అది చాలా మంచిది అని చెప్పి.. పక్కన వారిని నమ్మిస్తుంటారు. పక్క వారిని మోసం చయడంలో వీరు ముందుంటారు.
7. తుల రాశి..
ఈ రాశివారు పెద్ద మ్యానిప్యూలేటర్లు. కానీ.. అందరి ముందు మాత్రం తామంతా మంచివారు ఎవరూ లేరు అన్నట్లు నటిస్తూ ఉంటారు. పైకి మాత్రం చాలా స్మూత్ గా మాట్లాడుతూ ఉంటారు. పక్క వారిలో విషం నింపుతూ ఉంటారు. ఈ విషయం వారికి తప్ప మరెవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు.
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ చీకటిలోనే బతికేస్తూ ఉంటారు. వీరిలో చాలా సీక్రెట్స్ ఉంటాయి. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచేసుకుంటూ ఉంటారు. ఎవరినైనా ఇట్టే మోసం చేస్తారు.
9.ధనస్సు రాశి..
ఈ రాశివారు తాము ప్రేమించిన వారిని చాలా సులభంగా మోసం చేస్తూ ఉంటారు. వారు ఎంత దగ్గరవ్వాలని చూసినా వీరు దూరంగా పారిపోతూ ఉంటారు. వీరు దూరంగా ఉంటూ.. తప్పంతా ఎదుటివారిదే అన్నట్లుగా నటిస్తారు. నిజమైన తప్పు తమవైపే ఉందనే విషయం తెలిసినా.. ఈ విషయాన్ని బయటపడనివ్వరు.
10.మకర రాశి..
ఈ రాశివారు అందరితోనూ మంచిగా ఉంటారు. కానీ ఎప్పుడైనా ఎవరితోనైనా చెడిందో.. వారితో మళ్లీ మంచిగా ఉండాలని అనుకోరు. వాళ్లని జీవితంలో క్షమించరు. ఆ విషయం నుంచి కనీసం బయటకు కూడా రారు. లోపల విషం పెట్టుకొని అందరి ముందూ మంచిగా ఉన్నట్లు నటిస్తారు.
11.కుంభ రాశి..
ఈ రాశివారికి వ్యంగ్యం చాలా ఎక్కువ. ఇతరులపై క్రష్ పెట్టుకుంటారు. కానీ ఈ విషయాన్ని అస్సలు అంగీకరించరు. తొందరగా చుట్టూ ఉన్నవారితో కనెక్ట్ అవ్వలేరు. కానీ అందరి ముందూ మాత్రం బాగా నటిస్తారు.
12. మీన రాశి..
ఈ రాశివారు అక్కడ జరిగింది గోరంత అయితే.. కొండంత చేసి చూపిస్తుంటారు. అక్కడ జరిగిన దాన్ని మొత్తం మార్చేసి.. అన్నీ అబద్దాలే చెప్పేసి నమ్మిస్తుంటారు. అందరి ముందు సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.