నేడు ఓ రాశివారికి స్త్రీ సంబంధిత సమస్యలు చికాకు తెప్పిస్తాయి!
Today Rasi Phalalu:ఈ రాశి ఫలాలు 7.11.2025 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది.
వృషభ రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్త్రీ సంబంధిత సమస్యలు కొంత చికాకు తెప్పిస్తాయి. వ్యాపారాలలో అవరోధాలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మిథున రాశి ఫలాలు
వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతి వ్యవహారంలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
బంధుమిత్రుల నుంచి విమర్శలు అధికమవుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి సమస్యలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో ఎంత శ్రమపడినా ఫలితం కనిపించదు.
సింహ రాశి ఫలాలు
ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. ప్రముఖుల నుంచి సభ, సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.
కన్య రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంతాన విద్యా విషయాలలో మరింత కష్ట పడాల్సి వస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తవుతాయి. డబ్బు విషయాల్లో ఇతరులకు మాట ఇచ్చే ముందు పునరాలోచన చేయటం మంచిది.
తుల రాశి ఫలాలు
స్థిరాస్తి క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూరప్రాంత బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
వృశ్చిక రాశి ఫలాలు
దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను చేజారకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి లభించదు. భాగస్వామ్య వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వాహన ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.
మకర రాశి ఫలాలు
బంధు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.
కుంభ రాశి ఫలాలు
ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. శత్రు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఉద్యోగాలలో ఇతరులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీన రాశి ఫలాలు
దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు కలిసివస్తాయి.