నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం కలుగుతుంది!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 6.10.2025 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
దీర్ఘ కాలిక అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరిగి తగిన విశ్రాంతి లభించదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో అవరోదాలు కలుగుతాయి. బంధుమిత్రుల వల్ల కొన్ని ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థుల ఫలితాలు ఉత్సాహన్నిస్తాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.
మిథున రాశి ఫలాలు
దూరప్రాంత బంధు మిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.
సింహ రాశి ఫలాలు
దూర ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు తెప్పిస్తాయి. చేపట్టిన పనులలో ఒడిదుడుకులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.
కన్య రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
తుల రాశి ఫలాలు
భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఇంటా బయటా అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. శత్రు సమస్యలు నుంచి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఇతరులకు తొందరపడి మాట ఇవ్వటం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు.
ధనుస్సు రాశి ఫలాలు
బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి వస్తుంది. ఇంట్లో కొన్ని పరిస్థితులు చికాకు కలిగిస్తాయి. పిల్లల చదువు విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.
మకర రాశి ఫలాలు
ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించి లాభాలను అందుకుంటారు.
కుంభ రాశి ఫలాలు
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.
మీన రాశి ఫలాలు
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. ఆత్మీయులతో కొన్ని కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆదాయం పెరుగుతుంది.