నేడు ఓ రాశివారు చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడతారు!
Today Rasi Phalalu:ఈ రాశి ఫలాలు 5.11.2025 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
నూతన విద్య అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
వృషభ రాశి ఫలాలు
చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిథున రాశి ఫలాలు
దీర్ఘకాలిక అప్పులు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తికావు. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. ఉద్యోగులను వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది.
కర్కాటక రాశి ఫలాలు
ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
సింహ రాశి ఫలాలు
ఉద్యోగులు కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరప్రాంతాల వారి నుంచి విలువైన సమాచారం అందుతుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.
కన్య రాశి ఫలాలు
సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల లాభం పొందుతారు. ఆదాయం బాగుంటుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
తుల రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో నష్టాల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.
వృశ్చిక రాశి ఫలాలు
అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.
ధనుస్సు రాశి ఫలాలు
వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి. డబ్బు విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.
మకర రాశి ఫలాలు
ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. అప్పుల బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయట పడతారు.
కుంభ రాశి ఫలాలు
సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది.
మీన రాశి ఫలాలు
ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడతారు. కంటి సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుంచి విమర్శలు తప్పవు.