Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నదమ్ములతో ఆస్తి గొడవలు తప్పవు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 29.12.2025 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో సొంత నిర్ణయాలు కలిసివస్తాయి.
వృషభ రాశి ఫలాలు
ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ యత్నాలు కలిసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.
మిథున రాశి ఫలాలు
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు.
కర్కాటక రాశి ఫలాలు
ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
సింహ రాశి ఫలాలు
ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ సభ, సమావేశాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.
కన్య రాశి ఫలాలు
సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ ప్రస్తావన వస్తుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల రాశి ఫలాలు
దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణ యత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
ధనుస్సు రాశి ఫలాలు
పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో ఊహించని మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
మకర రాశి ఫలాలు
ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
కుంభ రాశి ఫలాలు
ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు ఒత్తిడితో కానీ పూర్తి కావు. సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. మొండి బాకీలు కొన్ని వసూలవుతాయి.
మీన రాశి ఫలాలు
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

