Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 14.06.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
కొన్ని వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం దక్కదు. భూ వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభ రాశి ఫలాలు
ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభదాయకం. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.
మిథున రాశి ఫలాలు
ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న విజయం సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు తప్పవు.
సింహ రాశి ఫలాలు
ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధు మిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. రుణ దాతల ఒత్తిడులు చికాకు కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి.
కన్య రాశి ఫలాలు
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనుల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
తుల రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. సోదరుల నుంచి ఆకస్మిక ధన ప్రాప్తి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు రాశి ఫలాలు
దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
మకర రాశి ఫలాలు
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గం నుంచి అరుదైనా ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి ధన లాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత ఉపశమనం పొందుతారు.
కుంభ రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు.
మీన రాశి ఫలాలు
సంఘంలో పెద్దల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

