MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Astrology
  • ఆడవాళ్లూ.. మంగళసూత్రానికి సంబంధించిన ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే?

ఆడవాళ్లూ.. మంగళసూత్రానికి సంబంధించిన ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే?

కాలం చాలా మారుతూ పోతోంది. దీనికి తగ్గట్టు జనాలు కూడా మారుతున్నారు. ముఖ్యంగా ట్రెండ్ ను ఫాలో అయ్యేవారు పెళ్లి తర్వాత మంగళసూత్రాన్ని తీసేసి చిన్న నల్ల పూసల దండను వేసుకుని బయటకు వెళుతుంటారు. కొంతమంది అది కూడా వేసుకోరు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 17 2024, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mangalsuthra

Mangalsuthra

హిందూమతంలో మంగళసూత్రాన్ని, సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక మహిళకు పెళ్లైందన్న సంగతిని ఆమె మెడలో ఉన్న మంగళసూత్రం, కాలి మెట్టెలు, సూధూరమే చెప్తాయి. ముఖ్యంగా మంగళసూత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే చాలా మంది తెలిసో తెలియక కొన్ని మంగళ సూత్రానికి సంబంధించిన కొన్ని పొరపాట్లను చేస్తుంటారు. కానీ దీనివల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు మంగళ సూత్రానికి సంబంధించిన ఎలాంటి పొరపాట్లను చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Mangalsutra

Mangalsutra

మంగళసూత్రం ప్రాముఖ్యత 

వివాహిత స్త్రీలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైందిగా భావిస్తారు. మంగళసూత్రం  భార్యాభర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇది భార్యాభర్తల అనుబంధాన్ని తెలియజేస్తుంది. అందుకే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు మంగళసూత్రానికి సంబంధించి ఎలాంటి పొరపాట్లు చేయకూడదంటే?

36

వేరొకరి మంగళసూత్రం ధరించకూడదు

పలు నమ్మకాల ప్రకారం.. వేరొక మహిళ మంగళసూత్రాన్ని ఎప్పుడూ కూడా ధరించకూడదు. అసలు ఇలా ధరించడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల బంధం బలహీనపడుతుందట. 

46

మంగళసూత్రం ధరించకపోవడం 

పెళ్లి అయిన నాటి నుంచి భర్త ఉన్నంత వరకు ప్రతి మహిళ మంగళసూత్రాన్ని ఖచ్చితంగా ధరించాలి. కానీ ట్రెండ్ ను ఫాలో అయ్యే ఆడవారు మాత్రం మంగళ సూత్రాన్ని తీసేసి వెళుతుంటారు. కానీ ఇలా అస్సలు మంచిది కాదు. పెళ్లైన ఆడవారి మెడ ఖాళీగా ఉంచకూడదని నమ్ముతారు.

56
Mangalsuthra

Mangalsuthra

ఇలాంటి మంగళసూత్రం ధరించకూడదు

మంగళసూత్రం ముత్యాలు విరిగిపోతే మెడలో వేసుకోకూడదని పెద్దలు చెప్తున్నారు. ఇలాంటి మంగళసూత్రం మీ మెడలో ఉంటే దాన్ని వెంటనే మార్చండి. ఎందుకంటే మెడలో విరిగిన మంగళసూత్రం ధరించడం మంచిది కాదు.
 

66
Mangalsutra

Mangalsutra

విభేదాలు 

మంగళసూత్రానికి సంబంధించిన ఈ తప్పులు చేస్తే మాత్రం భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండరు. అందుకే మీరు ఈ పొరపాట్లను అస్సలు చేయకండి. మంగళసూత్రాన్ని అన్ని రోజుల్లో కొనకూడదని జ్యోతిష్యులు చెప్తారు. మంగళ సూత్రాన్ని కొనడానికి సోమవారం, గురువారం, శుక్రవారాలు అనుకూలంగా ఉంటాయి. 

దుష్ట కంటి నుంచి రక్షిస్తుంది. 

మంగళసూత్రంలో బంగారం, నల్ల ముత్యాలను  ఉపయోగిస్తారు. ఈ నల్ల ముత్యాలు భర్తను దుష్ట దృష్టి నుండి రక్షించడానికి కూడా పనిచేస్తాయిని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Tips: ఇంట్లో చెప్పులు ఏ దిశలో పెడుతున్నారు? ఈ ఒక్క ప్లేస్ లో పెడితే.. మీ దరిద్రం మొత్తం పోయినట్లే..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి సొంత నిర్ణయాలతో లాభాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు!
Recommended image3
Jupiter Transit: గురు, విష్ణుల కలయికతో పవర్ ఫుల్ యోగం.. ఈ 3 రాశులకు రాజభోగం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved