ఈ తేదీలో పుట్టిన పిల్లలకు కోపం చాలా ఎక్కువ.. ఎలా కంట్రోల్ చేయాలో తెలుసా?
ఈ తేదీల్లో పుట్టిన వారంతా న్యూమరాలజీ ప్రకారం 1వ తేదీ కిందకు వస్తారు. వీళ్లకు.. చిన్న విషయాలకే, వాళ్లు అడిగింది ఏది ఇవ్వకపోయినా విపరీతంగా కోపం వచ్చేస్తూ ఉంటుందట.
పిల్లలు అందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు ఎప్పుడూ నాటీ పనులు చేస్తూ ఉంటారు. కొందరు అస్సలు పేరెంట్స్ మాట వినరు. ఇక కొందరు పిల్లలకు చిటికీ మాటికీ కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయితే.. న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని తేదీల్లో పుట్టిన పిల్లలకు కోపం ఎక్కువగా ఉంటుందట. ఏ తేదీల్లో పుట్టిన పిల్లలకు కోపం ఎక్కువగా ఉంటుంది..? వారి కోపం పోగొట్టడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
న్యూమరాలజీ ప్రకారం 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన పిల్లలకు కోపం చాలా ఎక్కువగా ఉంటుందట. ఈ తేదీల్లో పుట్టిన వారంతా న్యూమరాలజీ ప్రకారం 1వ తేదీ కిందకు వస్తారు. వీళ్లకు.. చిన్న విషయాలకే, వాళ్లు అడిగింది ఏది ఇవ్వకపోయినా విపరీతంగా కోపం వచ్చేస్తూ ఉంటుందట.
number 1
అయితే.. ఈ పిల్లల్లో కోపం పోగొట్టడానికి ఏవేవో తిప్పలు పడాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల హోం రెమిడీస్ ఫాలో అయితే చాలు ఆ పిల్లల్లో కోపాన్ని సులభంగా తొలగించవచ్చు అని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ సూర్యుడికి నీళ్లు, పాలు కలిపి సమర్పించాలి. మీ పిల్లలతో రెగ్యులర్ గా ఇలా చేయించాలి. ఇలా చేయించడం వల్ల వారి కోపం తగ్గే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా.. పిల్లలతో మెడిటేషన్ చేయించండి. రోజూ ధ్యానం చేయించి.. సూర్య మంత్రాన్ని రోజుకి 51 సార్లు జపించేలా చేయండి. ఓం సూర్యాయ నమ: అనే మంత్రం జపిస్తే సరిపోతుంది.
పూజ లేదా ఏదైనా శుభ కార్యాల సమయంలో పిల్లలకు ఎరుపు లేదంటే.. నారింజ రంగు దుస్తులు వేయండి.. ఈ నియమాలు పాటిస్తూ ఉంటే.. మీ పిల్లల్లో కోపం తగ్గే అవకాశం ఉంటుంది.