వైయస్ పాలన గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం: ఎంపీ విజయసాయి రెడ్డి

First Published 8, Jul 2020, 11:45 AM

మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు పార్క్ హోటల్ జంక్షన్ లో కొయ్య ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

విశాఖపట్నం: మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినోత్సవ వేడుకలు పార్క్ హోటల్ జంక్షన్ లో కొయ్య ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వైసిపి జాతీయ ప్రధాన  కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ముఖ్య అతిదిగా విచ్చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ... వైయస్ జన్మదినోత్సవాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించడం  హర్షదాయకం అన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్సార్ అని అన్నారు. అటువంటి ముఖ్యమంత్రి దేశ చరిత్రలో మరొకరెవరూ కనిపించరని పేర్కొన్నారు.  జలయజ్ఞం ద్వారా పంట భూములను సస్యశ్యామలం చేశారని,  వ్యవసాయం  దండగ అని గత ప్రభుత్వం భావిస్తే వైఎస్సార్ మాత్రం వ్యవసాయాన్ని పండగలా తీర్చిదిద్దారని పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించారన్నారు. 32 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం,  26 లక్షల ఎకరాల అటవీ భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించిన ఘనత వైఎస్సార్ కే దక్కుతుంది అని కొనియాడారు.  బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వైయస్ పని చేశారని విజయసాయి పేర్కొన్నారు. వైయస్ పాలన గుప్తుల కాలం నాటి స్వర్ణయుగం అని కొనియాడారు.  వైఎస్ పాలన ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని,  భావి తరాలు వైఎస్ పాలనను గుర్తు పెట్టుకుంటాయని తెలిపారు.

కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, శాసన సభ్యులు నాగిరెడ్డి, అదీప్రాజ్, నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, సమన్వయ కర్తలు కేకే రాజు, అక్కరమాని విజయనిర్మల, మాజీ శాసనసభ్యులు తైనాల విజయకుమార్, ఎస్ రెహన్ తిప్పల మూర్తిరెడ్డి, నాయకులు ఐహెచ్ ఫరూకి, రవిరెడ్డి, పక్కి దివాకర్, గుంటూరు నరసింహమూర్తి, వరుదు కళ్యాణి, జాన్ వెస్లీ, తుల్లి చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

loader