కొడాలి నాని దూకుడు: వైసీపీకి చిక్కులు

First Published 24, Sep 2020, 4:01 PM

ఏపీ రాజకీయాల్లో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు హీట్ ను పెంచాయి. మంత్రిని భర్తరప్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని వైసీపీ స్పష్టం చేసింది.

ఏపీ మంత్రి కొడాలి నాని దూకుడు వైసీపీని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా విపక్షాలను ఏకం చేశాయి. విపక్షాలు మూకుమ్మడిగా వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని  చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ ను పుట్టించాయి. ప్రధానంగా టీడీపీపై విమర్శలు గుప్పించడంలో ఆయన ముందుంటాడు. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, లోకేష్ పై ఆయన ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తారు. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు చెబితేనే నాని తన నోటికి పనిచెబుతారు.

రాష్ట్రంలో విపక్షాలకు ప్రధానంగా టీడీపీని కౌంటర్ చేయడంలో కొడాలి నాని వైసీపీకి ఆయుధంగా మారాడు. కొడాలి నాని చేసిన విమర్శలు..కౌంటర్లతో టీడీపీ కొన్ని సమయాల్లో ఆత్మరక్షణలో పడింది.  అయితే నాని చేసిన విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది టీడీపీ.

రాష్ట్రంలో ఆలాయాల్లో జరిగిన విధ్వంసాలు, అంతర్వేది రథం దగ్ధం, విజయవాడలో కనకదుర్గ అమ్మవారి రథంపై సింహాల విగ్రహాలు చోరీకి గురైన ఘటనలతో  పాటు తిరుమల డిక్లరేషన్ పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వైసీపీకి రాజకీయంగా ఇబ్బందిగా మారాయి.

విజయవాడ కనకదుర్గ అమ్మవారి రథంపై సింహాలు చోరీకి గురికావడంపై నాని చేసిన వ్యాఖ్యలను హిందూ సంఘాలు, బీజేపీ, టీడీపీ లు తీవ్రంగా తప్పుబట్టాయి. రథం పోయిన విగ్రహాలు చోరీకి గురైనా దేవుడికి ఏం నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. మరో వైపు తిరుమల డిక్లరేషన్ విషయంలో టీడీపీ, బీజేపీ తీరును విమర్శిస్తూ నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

తిరుమల డిక్లరేషన్ పై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు తిరుమలలో డిక్లరేషన్ ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై విపక్షాలు వైసీపీని లక్ష్యంగా దాడి చేశాయి. దీంతో మంత్రి కొడాలి నాని ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగతమైనవిగా ప్రకటించారు. అయితే తిరుమల డిక్లరేషన్ పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని  ఆయన అభిప్రాయపడ్డారు.

సతీసమేతంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని బీజేపీ నేతలు జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. భార్యను తీసుకొని మోడీ దేశంలోని దేవాలయాను సందర్శించాలని ఆయన సూచించారు. మరో వైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడ భార్యను తీసుకొని దేవాలయాలకు వెళ్లాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇవాళ రాష్ట్రంలో నిరసనలకు పిలుపునిచ్చింది. కొడాలి నానిని మంత్రివర్గం నుండి భర్తరప్ చేయాలని డిమాండ్ చేసింది బీజేపీ. నాని కొంత కాలంగా చేస్తున్న వ్యాఖ్యలు సీఎం జగన్ కు తెలిసే చేస్తున్నారని కూడ బీజేపీ వ్యాఖ్యానించింది.

ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఇవాళ మధ్యాహ్నం వివరణ ఇచ్చింది. ప్రధాని మోడీపై కొడాలి నాని వ్యాఖ్యలు సరైనవి కావని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయం మంత్రి నానికి అర్ధమై ఉండొచ్చన్నారు. ఈ వ్యాఖ్యలు నాని వ్యక్తిగతమైనవిగా ఆయన పేర్కొన్నారు.

మంత్రి నాని దూకుడు రాజకీయంగా కొంతకాలం కలిసొచ్చింది. ఆలయాలపై, మోడీపై చేసిన విమర్శలు రాజకీయంగా కొంత వైసీపీకి, మంత్రి నానికి ఇబ్బందిని కల్గించినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతోనే వైసీపీ రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలకు దిగింది. ఈ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని నాని వ్యక్తిగతమైనవిగా స్పష్టం చేసిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

loader