జగన్ తో పాటు 15 మంది మంత్రులు: జాబితాలో వీరే...

First Published 25, May 2019, 11:22 AM

ఈ నెల 30వ తేదీన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, తొలి విడత తనతో పాటు 15 మంది చేత మంత్రులుగా ప్రమాణం చేయించడానికి జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

అమరావతి: ఈ నెల 30వ తేదీన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, తొలి విడత తనతో పాటు 15 మంది చేత మంత్రులుగా ప్రమాణం చేయించడానికి జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని సభ్యుల సంఖ్యను బట్టి జగన్ తాను కాకుండా 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే తొలి విడత 15 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన మంత్రివర్గంలో పాత ముఖాలతో పాటు కొత్త ముఖాలు కూడా ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

బాలినేని శ్రీనివాస రెడ్డి (ఒంగోలు)కు, ఆళ్ల రామకృష్ణా రెడ్డి (మంగళగిరి)కి మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని జగన్ తన ఎన్నికల ప్రచారం సందర్భంలో చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ విషయంలో కూడా అదే విషయం చెప్పారు. అయితే, రాజశేఖర్ ఇటు శాసనసభలో గానీ అటు శాసన మండలిలో గానీ సభ్యుడు కాడు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారా, లేదా అనేది చూడాల్సి ఉంది.

తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానాలు అందినప్పటికీ ఆ పార్టీలో చేరకుండా తన పక్కన నిలిచిన వారికి మంత్రివర్గం కూర్పులో జగన్ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది ఎస్టీలకు, బలహీనవర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు, విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణకు, తూర్పు గోదావరి జిల్లా నుంచి విశ్వరూప్ కు జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.

నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డికి కూడా క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణకు మాత్రమే కాకుండా కురుపాం ఎమ్మల్యే పాముల పుష్ప శ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్న దొరలు మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. టీడీపి భారీ ఆపర్లు ఇచ్చినప్పటికీ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారు పార్టీ మారకుండా వైసిపిలోనే ఉండిపోయారు.

విశాఖపట్నం జిల్లా నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి తుని ఎమ్మెల్యే దాదడిశెట్టి రాజం, కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, అమలాపురం ఎమ్మెల్యే పినిపి విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు రేసులో ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మచిలీపట్నం నుంచి పేర్ని నాని, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, పెనమలూరు ఎమ్మెల్యే కె. పార్థసారథి మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు.

గుంటూరు జిల్లా నుంచి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంత్రి పదవులు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డిలకు అవకాశం ఉంది.

చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రోజా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కడప జిల్లా నుంచి ఆజ్మత్ బాషా షేక్, అనంతపురం జిల్లా నుంచి అనంత వెంకటరామిరెడ్డి, కర్నూలు జిల్లానుంచి బుగ్గన రాజేందర్నాథ్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

loader