చంద్రబాబు సరే: కేసీఆర్ కూ జగన్ కూ ఎంత తేడా?

First Published 15, Jun 2019, 12:17 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఛాయలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై పడుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావంతో కేసీఆర్ పై విమర్శలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ కన్నా జగన్ బెట్టర్ అనే వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటోంది

గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేది. కేసీఆర్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు ప్రజల ఆమోదం పొందుతూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేసీఆర్ పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతూ వచ్చింది. చంద్రబాబు కన్నా కేసీఆర్ బెట్టర్ అని అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

ఫిరాయింపులను ప్రోత్సహించే విషయంలో జగన్ చేసిన ఒక్క ప్రకటనతో కేసీఆర్ పై అన్ని రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని జగన్ షరతు పెట్టారు. తాను ఐదుగురిని లాక్కుంటే టీడీపి ప్రతిపక్ష హోదా గల్లంతవుతుందని, కానీ తాను అలా చేయబోనని ఆయన చెప్పారు. అందుకు భిన్నంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెసు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేయడానికి ఏకంగా 12 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నారు

ఫిరాయింపుల విషయాన్ని పక్కన పెడితే మిగతా విషయాల్లో కూడా జగన్ కేసీఆర్ కన్నా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తొలుత తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే, కేసీఆర్ మాత్రం తొలుత తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడంతో పాటు డిప్యూటీ సిఎంగా మొహమ్మద్ అలీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు గానీ పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకోలేదు.

జగన్ మహిళలను తన మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాకుండా డిప్యూటీ సిఎం హోదా కూడా ఇచ్చారు. మహిళా మంత్రి మేకతోటి సుచరితకు ఏకంగా ప్రధానమైన హోం మంత్రిత్వ శాఖను కేటాయించారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఇప్పటి వరకు మహిళా మంత్రి లేరు. తొలి విడత ప్రభుత్వం మహిళా మంత్రి లేకుండా గడిచిపోయింది. ఇద్దరు మహిళలను మంత్రివర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ హామీని అమలు చేయడం లేదు

నష్టాల్లో ఉన్న ఎపిఎస్ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడానికి జగన్ చర్యలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన లాంఛనాలు పూర్తి చేయడానికి ఓ కమిటీని కూడా వేశారు. సమ్మెకు దిగుతామని హెచ్చరించిన కార్మికులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. కేసీఆర్ మాత్రం అందుకు సిద్ధపడడం లేదు. సమ్మె చేస్తామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి కార్మికులకు ఆయన హెచ్చరికలు జారీ చేసిన సందర్భం కూడా ఉంది

ప్రభుత్వోద్యోగులకు ఐఆర్ పెంపుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన అటువంటి హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదు. అదే విధంగా ఉద్యోగులు కోరుతున్న సిపిఎస్ రద్దుకు జగన్ వెంటనే నిర్ణయం తీసుకోగా, కేసీఆర్ మాత్రం పెదవి విప్పడం లేదు. పింఛన్ల పెంపు విషయంలో కూడా జగన్ వెంటనే నిర్ణయం తీసుకుని అమలుకు శ్రీకారం చుట్టారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సచివాలయానికి వస్తూ విధులు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ మాత్రం సచివాలయానికి దూరంగా ఉంటున్నారు. ఆయన ప్రగతిభవన్ లోనే ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

జగన్, కేసీఆర్ మధ్య సామ్యం మాత్రం ఒక్కటి ఉంది. ఇరువురు కూడా స్వరూపానందేంద్ర సరస్వతికి, చిన జీయర్ స్వామికి భక్తులు. ఈ విషయంలో మాత్రం జగన్ కేసీఆర్ ను అనుసరిస్తూ పాలనాపరమైన నిర్ణయాలు చేయడంలో మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు

loader