మిత్రుడు కేసీఆర్ కు జగన్ షాక్: చంద్రబాబు మీద పైచేయి

First Published 13, Jun 2019, 3:34 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇచ్చారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి మీద నైతికంగా పైచేయి సాధించారు. చంద్రబాబుకు ఫిరాయింపులపై స్పష్టమైన సంకేతాలు పంపించారు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మిత్రుడు, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇచ్చారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి మీద నైతికంగా పైచేయి సాధించారు. చంద్రబాబుకు ఫిరాయింపులపై స్పష్టమైన సంకేతాలు పంపించారు.

ఫిరాయింపులపై వైఎస్ జగన్ గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్పష్టమైన వైఖరిని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తమ పార్టీలో చేరాలని వస్తే కచ్చితంగా రాజీనామాలు చేసి రావాలని చెప్తామని, రాజీనామాలు చేసి వస్తేనే తమ పార్టీలో చేర్చుకుంటామని ఆయన చెప్పారు. ఐదుగురు శాసనసభ్యులను తాను చేర్చుకుంటే ప్రతిపక్ష హోదా గల్లంతవుతుందని ఓ హెచ్చరిక కూడా చేశారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు తన పార్టీకి చెందిన 23 మంది శాసనసభ్యులను, ముగ్గురు ఎంపీలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్న వైనాన్ని గుర్తు చేశారు. ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. తాను అలా చేయనని చెప్పడం ద్వారా జగన్ చంద్రబాబు మీద పైచేయి సాధించారని చెప్పవచ్చు.

కాగా, కేసీఆర్ కు జగన్మోహన్ రెడ్డి తన ప్రకటన ద్వారా షాక్ ఇచ్చారు.  2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని తలసాని శ్రీనివాస యాదవ్ వంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు.. తెలుగుదేశం పార్టీని రూపుమాపే ఉద్దేశంతో అలా చేశారు. అయితే, తమ పార్టీలకు రాజీనామాలు చేయకుండానే వారు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో కొనసాగారు

రెండోసారి 2019లో గెలిచిన తర్వాత కాంగ్రెసు ఎమ్మెల్యేలను కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. ఏకంగా 12 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని, శాసనసభలో కాంగ్రెసు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేసే వ్యూహానికి పూనుకున్నారు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. జగన్ వైఖరి ఒక రకంగా కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేదేనని చెప్పవచ్చు.

loader