రోజా 'రాఖీ' రాజకీయం: చిత్తూరు రాజకీయాల్లో మార్పులు

First Published 6, Aug 2020, 10:35 AM

చిత్తూరు రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా మరో సంచలనానికి తెరలేపారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంతో ఆమె రాజీకి వచ్చారా అనే చర్చ చిత్తూరు రాజకీయాల్లో సాగుతోంది.

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకొన్న నగరి ఎమ్మెల్యే రోజా నిత్యం వార్తల్లో ఉంటారు. తనకు రాజకీయంగా ప్రత్యర్ధిగా చెప్పుకొనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డికి రాఖీ కట్టడంతో ఆమె మరోసారి చిత్తూరు రాజకీయాల్లో చర్చకు తెరలేపారు. రాజకీయంగా పొసగని నేత కుటుంబంతో సఖ్యతను కోరుకొంటున్నట్టుగా ఆమె సంకేతాలు ఇచ్చారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోజాకు మంత్రి పదవి వస్తోందని భావించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో చిత్తూరు  జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఇదే జిల్లా నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి,  నారాయణస్వామికి జగన్ కేబినెట్ లో చోటు కల్పించారు.

మంత్రివర్గంలో చోటు దక్కని రోజా తొలుత అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై ఆమె సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాత ఆమె వైఖరిలో మార్పు వచ్చింది. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవిని జగన్ ఆమెకు కట్టబెట్టారు.  అయితే చిత్తూరు జిల్లాలోని వైసీపీ నేతల్లో మధ్య సఖ్యత లేదు.

జిల్లాలో రాజకీయంగా తనను అణగదొక్కడానికి కొందరు చూస్తున్నారని, తనను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న భావన ఆమెలో ఎప్పటి నుండో నాటుకుపోయింది.

ఇదే క్రమంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుటి నుండి జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో వైరం కూడా నడుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆమె నేరుగా ఫైట్ కు కూడ సిద్దపడింది. తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె మీడియా వేదికగానే విమర్శలు చేసింది.

మొదటి తనకి మంత్రి పదవి దక్కకుండా   చేశారని అటు తరువాత గత ఎన్నికల్లో తనను ఓడించాలని చూశారంటూ  పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంపై ఆమె ఆరోపణలు చేశారు. పుత్తూరులో ఓ ప్రారంభోత్సవానికి హాజరైన రోజాపై  స్థానిక నేతలు ఆమె కారుపై దాడి చేశారు. దీని వెనుక పెద్దిరెడ్డి వర్గం హస్తం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

నగరి మున్సిపల్  ఛైర్మెన్ భర్త కేజీ కుమార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం. కేజీకుమార్ షష్టిపూర్తి వేడుకలకు హాజరుకావొద్దని రోజా వైసీపీ క్యాడర్ కు వాట్సాప్ సందేశం పంపారు. ఈ సందేశం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాజరుకావడం కలకలం రేపింది. రోజా హాజరు కానున్నా వీరిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం రాజకీయంగా కలకలానికి దారితీసింది.

జిల్లాలో ఇద్దరు  నేతలతో వైరం రాజకీయంగా రోజాకు పెద్ద నష్టమే చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సమయంలో రోజా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. పెద్దిరెడ్డి  తనయుడు  ఎంపీ మిథున్ రెడ్డికి రాఖీ కట్టి ప్రత్యర్ధివర్గాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇదే ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంతో పాటు నారాయణస్వామి వర్గీయుల్లో కూడ హాట్ టాపిక్ గా మారింది.

పెద్దిరెడ్డి వర్గంతో రోజా రాజీకి వచ్చిందా... ఈ కారణంగానే రాఖీ కట్టిందా అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే ఇతర నేతలతో కలిసిపోవాలనే భావనతో రోజా రాఖీ పండుగను రాజకీయంగా తనకు అనుకూలంగా ఉపయోగించుకొందా అనే చర్చ కూడ సాగుతోంది. రోజా రాఖీ రాజకీయం ఏ మేరకు ఆమెకు కలిసి వస్తోందో చూడాలి.

loader