MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh: కుంకీ ఏనుగులుంటే మనుషులపై దాడులు ఆగిపోతాయా.? వీటి ప్రత్యేకత ఏంటి..

Andhra Pradesh: కుంకీ ఏనుగులుంటే మనుషులపై దాడులు ఆగిపోతాయా.? వీటి ప్రత్యేకత ఏంటి..

అన్నమయ్య జిల్లాలో మంగళవారం ఏనుగుల బీభత్సవం ఎంతటి విషాదాన్ని నింపిందో తెలిసిందే. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శేషాచలం అడవుల గుండా తలకోనకు నడిచి వెళ్తున్న భక్తులపై ఏనుగుల దాడిలో 5గురు మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే కుంకీ ఏనుగుల ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏనుగులు ఉండుంటే ప్రాణ నష్టం జరిగేది కాదని అంటున్నారు. ఇంతకీ ఏంటీ కుంకీ ఏనుగులు.? వీటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..   

3 Min read
Narender Vaitla
Published : Feb 26 2025, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
kumki elephants

kumki elephants

దాడి ఎక్కడ జరిగింది.? 

ఓబులవారి పల్లె మండలం గుండాలకోన అటవీ ప్రాంతంలో భక్తులపై ఏనుగులు దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శేషాచలం అడవుల గుండా తలకోనకు నడిచి వెళ్తున్న సమయంలో అటుగా వచ్చిన ఏనుగుల గుంపు భక్తులపైకి దాడికి దిగాయి. ఒక్కసారిగా ఏనుగులు భక్తులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా భయంతో కేకలు పెట్టారు. భక్తులు పరుగులు పెట్టినా ఏనుగులు వెంటపడి మరీ దాడి చేశాయి. 

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కిరకీ రూ. 10 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. అటవీశాఖ అధికారులు భక్తులను రిజర్వ్‌ అటవీ ప్రాంతాల ద్వారా ప్రయాణించవద్దని హెచ్చరించినా వచ్చినట్లు చెబుతున్నారు. భక్తులు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే వెళ్లాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. 
 

25
Asianet Image

స్పందించిన పవన్ కళ్యాణ్‌.

అన్నమయ్య జిల్లాలో జరిగిన ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. అటవీ శాఖ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను సందర్శించేందుకు వెళ్తున్న భక్తుల భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 
 

35
wild elephant

wild elephant

తెరపైకి కుంకీ ఏనుగుల అంశం. 

రాష్ట్రంలో ఏనుగుల బారి నుంచి మనుషుల్ని, పంటల్ని రక్షించేందుకు కర్ణాటక ప్రభుత్వం వాడుతున్న కుంకీ ఏనుగులను ఉపయోగించాలని గతంలో పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ఇందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నారు. గతేడాది ఆగస్టు 8వ తేదీన స్వయంగా బెంగళూరు వెళ్లి కుంకీ ఏనుగుల కోసం సీఎం సిద్ధరామయ్యతో చర్చించారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 27న విజయవాడలో ఒప్పందం చేసుకున్నారు. 

కర్ణాటకలో శిక్షణ పొందిన ఏనుగులతో ఏపీకి చెందిన అటవీ సిబ్బంది శిక్షణ కూడా ఇప్పిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇంత వరకు కుంకీ ఏనుగులు రాష్ట్రానికి రాలేవు. కాగా అటవీ శాఖ నియమనిబంధనలు ఏనుగుల తరలింపుకు అడ్డంకిగా మారడం వల్లే ఆలస్యమైందని తెలుస్తోంది. వన్య ప్రాణుల తరలింపు, వాటి సంరక్షణ విషయంలో ఉన్న నిబంధనలతో ఏపీకి కుంకీ ఏనుగుల తరలింపు ఆలస్యమైనట్టు సమాచారం. తాజాగా జరిగిన ఏనుగుల దాడులతో మరోసారి కుంకీ ఏనుగుల అంశం తెరపైకి వచ్చింది. 
 

45
Asianet Image

అసలేంటీ కుంకీ ఏనుగులు, వీటి ఉపయోగం ఏంటి.? 

కుంకీ ఏనుగులు అంటే ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగులు. అటవి ఏనుగులను అదుపులో పెట్టేందుకు వీటిని ఉపయోగిస్తారు. పంట పొలాలపై, మనుషులపై దాడి చేసే ఏనుగులను కంట్రోల్‌ చేస్తాయి. అటవీ పరిరక్షణ పనుల్లో సహాయపడుతాయి. అడవుల్లో గ్రామాలకు హాని చేసే ఏనుగులను కుంకీ ఏనుగుల సహాయంతో పట్టుకొని, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. అడవీ మార్గాలను పరిశీలించడానికి, కొత్త మార్గాలను సిద్ధం చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. పండుగలు, దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు, ప్రభుత్వ ఉత్సవాల్లో భాగంగా వీటిని ఉపయోగిస్తారు. కొండప్రాంతాల్లో భారీ బరువులను మోసేందుకు ఈ ఏనుగులను ఉపయోగిస్తారు. 
 

55
Asianet Image

ఈ ఏనుగులకు శిక్షణ ఎలా ఇస్తారు.? 

ఏనుగులు చిన్న వయసులోనే ఉన్నప్పుడే మానవులు వాటిని మచ్చిక చేసుకుంటారు. అనుభవజ్ఞులైన ఏనుగుల కాపరులు వీటికి శిక్షణ ఇస్తారు. మనుషుల ఆదేశాలను అనుసరించేలా ఏనుగులకు కఠినమైన శిక్షణ అందిస్తారు. భారత్‌లో ఈ కుంకీలు ఎక్కువగా అసోం, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. అసోంలోని కాజీరంగా నేషనల్ పార్క్‌లో ఈ ఏనుగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. 

ఏనుగు చెవిని కాలితో తడితే.. ఏనుగు ముందుకు వెళ్తుంది. చెవి వెనక భాగంలో కాలి తొడతతో గట్టిగా తడితే అప్పుడు వెనుకకు వెళ్తాయి. చెవి మధ్యభాగంలో అదిమితే ఏనుగు ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇలా మావటి ఇచ్చే సిగ్నళ్లకు అనుగుణంగా కుంకీలు ప్రవరిస్తాయి. ఇతర ఏనుగులను తరిమికొట్టే క్రమంలో ఇవి గట్టిగా అరుస్తాయి. ఇలా చేయడానికి మావటిలు వాటికి ఒక సంకేతాన్ని ఇస్తారు. ఇలా ఇతర ఏనుగుల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గిస్తారు. 
 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved