MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • Viral News: చూడ్డానికి అందంగా ఉన్నారు, ఆ బూతులేంటి అమ్మాయిలు.. అలేఖ్య చిట్టి పికిల్స్ పై నెటిజన్లు ఫైర్

Viral News: చూడ్డానికి అందంగా ఉన్నారు, ఆ బూతులేంటి అమ్మాయిలు.. అలేఖ్య చిట్టి పికిల్స్ పై నెటిజన్లు ఫైర్

సోషల్‌ మీడియా ఎంతో మంది జీవితాలను మార్చేస్తోంది. ఇన్‌ఫ్ల్యూయన్స్‌ర్లుగా కెరీర్‌ మొదలు పెట్టి వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తూ పాపులర్‌ అయిన వారిలో అలేఖ్య చిట్టి పికెల్స్‌ ఒకరు. ఎంతో పేరు సంపాదించుకున్న ఈ ముగ్గురు సిస్టర్స్ తాజాగా ఓ సంఘటనతో నెగిటివిటీ మూటగట్టుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..  

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 02 2025, 08:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
Viral News

Viral News

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి అలేఖ్య చిట్టి పికెల్స్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేస్తే చాలు కచ్చితంగా వీరి రీల్స్‌ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు మొదట అలేఖ్య చిట్టి పికెల్స్ పచ్చళ్ల బిజినెస్‌ను ప్రారంభించారు. యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ పోస్ట్‌ చేస్తూ వైరల్‌ అయ్యారు. వీరి వీడియోల్లాగే వీరి వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. 

సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌ ఎదుర్కొంటూ ఈ అక్కా చెల్లెళ్లు తమ బిజినెస్‌ను ఎంతో ధైర్యంగా కొనసాగిస్తున్నారు. నాన్‌ వెజ్‌ పికిల్స్‌ తయారీ విధానాన్ని వివరిస్తూ వీడియోలను పోస్ట్‌ చేస్తారు. అదే విధంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్లను స్వీకరించి నేరుగా పికిల్స్‌ను కొరియర్‌ చేస్తూ వ్యాపారాన్ని నడిపిస్తున్నారీ సిస్టర్స్‌. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ ఆడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెగిటివిటీ మూటగట్టుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
alekhya pickles issue

alekhya pickles issue

ఇంతకీ ఏం జరిగిందంటే.? 

అలేఖ్య చిట్టి పికెల్స్‌ ధరలను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ మెసేజ్‌ చేశాడు. కిలో చికెన్‌ పికిల్ ధర రూ. 1200 ఉందని, చేతులు జోడించిన ఎమోజీ పెట్టి, మరీ ఇంత ఎక్కువ ధరా.? అంటూ ఓ మెసేజ్‌ చేశాడు. ఈ మెసేజ్‌కు అలేఖ్య పికెల్స్ నుంచి కస్టమర్‌ను కించపరిచేలా ఉన్నట్లు ఉన్న ఓ ఆడియో వైరల్‌ అవుతోంది. పికిల్స్‌ కొనే స్థోమత లేని నువ్వు భవిష్యత్తులో పెళ్లి చేసుకోకు అంటూ వాయిస్‌ మెసేజ్‌లో ఉంది. అయితే అక్కడితో ఆగకుండా రాయడానికి కూడా వీలుకాని భాషలో దూషిస్తున్నట్లు ఆడియోలో ఉంది. 

ఫైర్‌ అవుతోన్న నెటిజన్లు

వైరల్ అవుతోన్న ఈ వాయిస్ మెసేజ్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కస్టమర్‌ వినయంగా ప్రశ్నిస్తే, అంత దారుణంగా మాట్లాడడం అవసరమా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. నెటిజన్లు ట్రోలింగ్‌ ఎక్కువయ్యే సరికి అలేఖ్య చిట్టి పికెల్స్ ఫోన్ నెంబర్ ను తాత్కాలింకంగా నిలిపివేశారు. అటు వాట్సాప్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశారు. ఇన్ స్టాలో కూడా ఓపెన్ అవ్వడం లేదు. ప్రస్తుతం వెబ్ సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. మంచి అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇలా ఓవర్‌ యాక్షన్‌ చేయడం ఏంటంటూ నిందిస్తున్నారు. 
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Crop insurance: రైతులకు గుడ్ న్యూస్.. పంటల బీమా గడువు పెంపు.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా?
Recommended image2
Dakshina Kailasam: గ్రహణ సమయంలోనూ మూయని ఏకైక గుడి.. ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా ఎందుకు వెళ్లాలి?
Recommended image3
Weather Update: పసిఫిక్ లో 2 తుపాన్లు.. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved