Airport Jobs : విజయవాడ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు ... రాత పరీక్ష లేకుండా నేరుగా సెలక్షన్
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ విమానాశ్రయంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎయిర్ పోర్ట్ లో జాబ్ పొందే అద్భుత అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. ఇంతకూ జాబ్స్ ఏమిటి? విద్యార్హతలు, సాలరీ? తదితర వివరాలు తెలుసుకొండి.
Vijayawada Airport Jobs
Vijayawada Airport Jobs : డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ యువతకు ఓ మంచి అవకాశం వచ్చింది. సొంత రాష్ట్రంలోనే అదీ విమానాశ్రయంలో ఉద్యోగం చేసే అవకాశమిది. విజయవాడ విమానాశ్రయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. విజయవాడతో పాటు గోవా,లేహ్,పోర్ట్ బ్లెయిర్, సూరత్ విమానాశ్రయాల్లో 274 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. కేవలం అన్ని అర్హతలు కలిగివుండి దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగంలో చేర్చుకుంటారు. అయితే ఇంగ్లీష్, హింది పై మంచి పట్టువుండి లోకల్ భాషలో మాట్లాడగలగాలి. అంటే విజయవాడ విమానాశ్రయంలో అయితే తెలుగు స్పష్టంగా మాట్లాడేవారికి అవకాశం ఇస్తారు. తెలుగు యువతకు ఇది కలిసివచ్చే అంశం. ఇంటర్వ్యూలో ప్రతిభ, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎయిర్ పోర్ట్ లో మంచి సాలరీతో ఉద్యోగ అవకాశం దక్కుతుంది.
Vijayawada Airport Jobs
విద్యార్హతలు :
నోటిఫికేషన్ పేర్కొన్నట్లు విజయవాడతో ఇతర విమానాశ్రయాల్లో సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలకు కనీస విద్యార్హత డిగ్రీ. ఏదయినా గుర్తింపుపొందిన బోర్డ్, యూనివర్సిటీ, విద్యాసంస్థ నుండి 60 శాతానికి పైగా మార్కులతో డిగ్రీ పూర్తిచేసి వుండాలి. ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు మాత్రం 55 శాతం మార్కులున్నా సరిపోతుంది.
వయోపరిమితి :
ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీ స్క్రీనింగ్ ఉద్యోగానికి ఎలాంటి అనుభవం లేని ప్రెషర్స్ కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 01.11.2024 నాటికి వయసు 18 నుండి 27 ఏళ్లలోపు వుండాలి. అంతకంటే ఎక్కువ వయసుంటే ఈ ఉద్యోగానికి అనర్హులు. అయితే ఎస్సి, ఎస్టి, ఓబిసి అభ్యర్థులకు సడలింపు వుంది.
సాలరీ :
సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాన్ని సాధించినవారికి మొదటి ఏడాదంతా ప్రతినెలా రూ.30,000 వేతనం చెల్లిస్తారు. ఇక రెండో సంవత్సరం మరో రెండువేలు పెంచి రూ.32,000, మూడో సంవత్సరం రూ.34,000 వేలు ఇస్తారు. అదనంగా టిఎ,డిఎ అలవెన్సులు లభిస్తాయి. ఉద్యోగపనుల్లో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సివస్తే రవాణా, లాడ్జింగ్ ఆంండ్ బోర్డింగ్ ఛార్జీలు లభిస్తాయి.
దరఖాస్తు విధానం :
నోటిఫికేషన్ లో పేర్కొన్న విద్యార్హతలు, వయసు కలిగిన అభ్యర్థులు www.aaiclas.aero వెబ్ సైట్ లోకి వెళ్లి సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ నెల డిసెంబర్ 10 సాయంత్రం 5.00 లోపు దరఖాస్తును ఫిల్ చేసి ఆన్ లైన్ లోనే సబ్మిట్ చేయాలి. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, ఆర్డినరీ పోస్ట్,కొరియర్ ద్వారా ఈ అప్లికేషన్ పంపిస్తే అంగీకరించబడవు... కేవలం ఆన్ లైన్ లో దరఖాస్తు పూర్తిచేయాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. అదే ఎస్సి, ఎస్టి, ఈడబ్ల్యుఎస్,మహిళా అభ్యర్థులు కేవలం రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ సర్టిఫికేట్ తో పాటు మార్క్స్ షీట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ దరఖాస్తుకు జతచేయాలి. కుల దృవీకరణ పత్రంతో పాటు ఆదార్ కార్డు కాపీ, ఇటీవలకాలంలో దిగిన కలర్ పాస్ ఫోటో జతచేయాలి. సిగ్నిచర్ స్కాన్ చేయాలి. ముందుగానే ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక చేస్తారు. అయితే ఇంటర్వ్యూలో ప్రతిభ కనబర్చినవారినే ఎంపిక చేస్తారు. డిగ్రీలో మంచి మార్కులు వుండి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నవారిని ఎంపిక చేస్తారు. ఎయిర్ పోర్ట్ ఉద్యోగాలను కోరుకునేవారికి ఇది మంచి అవకాశం.
ఇంటర్వ్యూ ఎప్పుడంటే..:
దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ తేదీ, టైమింగ్ ను అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేస్తారు. దాని ప్రకారమే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి వుంటుంది. ఇంటర్వ్యూకు హాజరైన వారినే ఉద్యోగాలకు ఎంపికచేస్తారు... దరఖాస్తు చేసి ఇంటర్వ్యూకు హాజరుకాకుంటే అంతే సంగతి. అభ్యర్థులను ఎంపిక నిర్ణయం పూర్తిగి నియామక సంస్థదే.