- Home
- Andhra Pradesh
- బిపాసాపై మృణాల్ ఠాకూర్ అసభ్యకర వ్యాఖ్యలు, ఆమె బాడీ గురించి అంత మాట అనేసిందేంటి.. వైరల్ వీడియో
బిపాసాపై మృణాల్ ఠాకూర్ అసభ్యకర వ్యాఖ్యలు, ఆమె బాడీ గురించి అంత మాట అనేసిందేంటి.. వైరల్ వీడియో
బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ బిపాసా బాడీపై మృణాల్ ఠాకూర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మృణాల్ ఠాకూర్ ఊహించని విధంగా ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.

బుల్లితెరపై నటించిన మృణాల్
సినిమాల్లో తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, ఆకట్టుకునే నటనతో గుర్తింపు పొందిన నటి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం ఒక పాత వ్యాఖ్య కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. తెలుగులో మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాకముందు బుల్లితెరపై కొంతకాలం నటిగా రాణించింది. ఆమె టెలివిజన్ కెరీర్ ప్రారంభ దశలో చేసిన ఒక కామెంట్ కి సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో అనేక విమర్శలు ఆమెపై వెల్లువెత్తాయి. నెటిజన్లు మృణాల్ ఠాకూర్ ని ట్రోల్ చేస్తున్నారు.
KNOW
బిపాసా బసుపై అసభ్యకర వ్యాఖ్యలు
ఈ వీడియో ‘కుమ్కుమ్ భాగ్య’ షూటింగ్ సమయంలోనిది. మృణాల్ ఠాకూర్ తన కోస్టార్స్ తో కలిసి ఓ చిట్ చాట్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ సమయంలో మృణాల్ బిపాసా బసు శరీరంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది. బిపాసా బసు కండలు పెంచి మగరాయుడులా ఉంటుంది. అలాంటి వారిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా.. నువ్వు వెళ్లి బిపాసాని పెళ్లి చేసుకో. బిపాసా కంటే నేనే ఎంతో అందంగా ఉన్నాను అంటూ ఆమెని అవమానించేలా కామెంట్స్ చేసింది.
I Swear… Even Urvashi doesn’t talk like this👇😭 Bipasha is not My favourite but bro.. you cannot compete With her!😭 Also.. Bipasha Even Ruled @Cristiano Heart. When No one knew About Mrunal😒 @mrunal0801 I feel Shy 4 U ( Ur confident)😭 @bipsluvurself Women who have inspired… pic.twitter.com/M3GUH5g2wo
— Kelly1313👑 (@Kelly131339867) August 12, 2025
నెటిజన్ల ట్రోలింగ్
ఆ సమయంలో మృణాల్ ఠాకూర్ సరదాగా ఆ కామెంట్స్ చేసినప్పటికీ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనితో నెటిజన్లకు ఆమె వ్యాఖ్యలు నచ్చడం లేదు. సోషల్ మీడియా యూజర్లు దీన్ని బాడీ షేమింగ్‌గా, మరో మహిళను కించపరచడంగా అభివర్ణించారు. “మరొకరిని తగ్గించి మాట్లాడటం తప్పు” అంటూ పలువురు విమర్శించారు. ఈ వీడియో వేగంగా పాపులర్ కావడంతో, కామెంట్స్ సెక్షన్‌లో విమర్శలు కురిశాయి.
ట్రోల్స్‌కు మృణాల్ స్పందన
మృణాల్ ఠాకూర్ ట్రోలింగ్ పై పరోక్షంగా స్పందించింది. మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ డ్రెస్ ధరించిన ఫొటోస్ షేర్ చేసి 'అదే పనిగా చూడడం ఆపండి' అని క్యాప్షన్ పెట్టారు. దీన్ని కొందరు ఆమె ట్రోల్స్‌కు పరోక్ష సమాధానంగా భావించారు.
బిపాసాని మించి పోయావా ?
ఈ పోస్ట్‌పై అభిమానుల ప్రతిస్పందన మిశ్రమంగా వచ్చింది. కొందరు ఆమె ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకోగా, మరికొందరు బిపాసా వ్యాఖ్యను మళ్లీ ప్రస్తావిస్తూ విమర్శలు కొనసాగించారు. “బిపాసాని మించి పోయావా, ఆమె పాపులర్.. నువ్వెవరికి తెలుసు?” లాంటి కామెంట్స్ పోస్ట్ చేశారు. ఇంకొకరు, “2007లో బిపాసా ఆసియాలో అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా, ‘మోస్ట్ డిజైరబుల్ వుమెన్ ఆఫ్ ఇండియా’లో చోటు సంపాదించారు… నువ్వు సాధించిందేంటి?” అని రాశారు. మొత్తంగా కొన్నేళ్ల క్రితం వీడియోతో మృణాల్ చిక్కుల్లో పడింది.