MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Andhra Pradesh
  • Success Story : అన్నక్యాంటిన్లో తింటూ చదివిన కుర్రాడికి మూడు ప్రభుత్వ ఉద్యోగాలా..! ఇది కదా సక్సెస్ అంటే

Success Story : అన్నక్యాంటిన్లో తింటూ చదివిన కుర్రాడికి మూడు ప్రభుత్వ ఉద్యోగాలా..! ఇది కదా సక్సెస్ అంటే

అన్న క్యాంటిన్లో తింటూ చదువుకున్న ఓ పేదింటి బిడ్డ ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. మెగా డిఎస్సి విజేత మీసాల రవికుమార్ సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.  

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 27 2025, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇది కదా సక్సెస్ అంటే..
Image Credit : TDP X Screenshot

ఇది కదా సక్సెస్ అంటే..

Telugu student Success Story : కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. లక్ష్యం వైపు సాగించే ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదురుకావచ్చు...వాటికి తలొగ్గితే కల కలగానే మిగిలిపోతుంది. ఎన్ని కష్టాలొచ్చినా కన్నీటిని దిగమింగుకుంటూ అయినా అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టకూడదు. ఇదే చాలామంది విజేతల సక్సెస్ సీక్రెట్. ఇలాంటి జర్నీయే ఆంధ్ర ప్రదేశ్ మెగా డిఎస్సి ర్యాంకర్ మీసాల రవికుమార్ ది కూడా.

DID YOU
KNOW
?
మెగా డిఎస్సి
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ల కోసం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అనుకున్నది సాధించేశాడుగా...
Image Credit : stockPhoto

అనుకున్నది సాధించేశాడుగా...

మద్యతరగతి కుటుంబంలో పుట్టిన రవికుమార్ చిన్నప్పటినుండి జీవితంలో ఏదైనా సాధించాలని కలగనేవాడు. ఇలా చదువుకునే సమయంలో తన లక్ష్యాన్ని వెతుక్కునేవాడు... చివరకు అతడు మంచి క్రీడాకారులను  తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ దిశగా అతడి ప్రయాణం సాగింది.. తనలాంటి పేద మద్యతరగతి చిన్నారులను క్రీడాకారులుగా తయారుచేయాలని ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాడు రవికుమార్.

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో రవికుమార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడిగా జాబ్ సాధించాడు. ఈ విభాగంలో ఒకటి కాదు ఏకంగా మూడు టీచర్ ఉద్యోగాలను పొందాడు. ఇలా అనుకున్నది చాలా గొప్పగా సాధించాడు రవికుమార్...  నేటి యువతకు ఆదర్శంగా నిలిచే అతడి సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం.

Related Articles

Related image1
Success story: టీ షాప్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న 27 ఏళ్ల యువకుడు.. సక్సెస్ సీక్రెట్ ఏంటంటే?
Related image2
Success story: ఇది క‌దా స‌క్సెస్ అంటే.. గొర్రెల కాప‌రి కుర్రాడు UPSC కొట్టేశాడు
35
డిఎస్సి విజేత రవి కుమార్ సక్సెస్ స్టోరీ
Image Credit : freepik

డిఎస్సి విజేత రవి కుమార్ సక్సెస్ స్టోరీ

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడుకి చెందిన మీసాల రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలగనేవాడు. ఇందుకోసం అతడు కష్టపడేవాడు... ఇటీవల అతడి కల నెరవేరింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సిలో రవికుమార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ జాబ్ పొందాడు. కేవలం ఒకటి కాదు ఏకంగా మూడు ఉద్యోగాలను సాధించాడు రవికుమార్.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదలచేసిన డిఎస్సి పలితాలలో రవికుమార్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో జిల్లాస్థాయి 19వ ర్యాంకు సాధించాడు. అంతేకాదు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ జోనల్ స్థాయిలో 25వ ర్యాంకు సాధించాడు. ఇక ఎస్జిటి (Secondary Grade Teacher) కేడర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కేటగిరీలో జోనల్ స్థాయి 35వ ర్యాంకు సాధించాడు. ఈ మూడిట్లో ఏదో ఒక ఉద్యోగాన్ని అతడు ఎంపిక చేసుకోనున్నాడు.

45
అన్న క్యాంటిన్ లో తిని ఈ ఉద్యోగాలు సాధించా..: రవికుమార్
Image Credit : X/Telugu Desam Party

అన్న క్యాంటిన్ లో తిని ఈ ఉద్యోగాలు సాధించా..: రవికుమార్

సక్సెస్ ఫుల్ గా ప్రభుత్వ టీచర్ జాబ్ సాధించిన రవికుమార్ తాజాగా తన ప్రిపరేషన్ గురించి వివరించాడు. ఉద్యోగానికి సన్నద్దమయ్యే సమయంలో తన ఆర్థిక కష్టాలు ఈ అన్న క్యాంటిన్ ద్వారా కొంత తగ్గాయని తెలిపాడు. తన ఆకలితీర్చిన అన్న క్యాంటిన్ గురించి అతడు చాలా గొప్పగా చెప్పకొచ్చాడు.

స్పోర్ట్స్ మీద ఉన్న మక్కువ, విద్యార్థులకు మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ ప్రొఫెషన్ ను ఎచుకున్నానని రవికుమార్ తెలిపాడు. కూటమి (టిడిపి, జనసేన, బిజెపి పార్టీలతో కూడిన) ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేసిందని... దీంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రైవేట్ ఉద్యోగాన్ని మానేసి గట్టిగా ప్రిపేర్ అయ్యానని తెలిపాడు. అప్పటివరకు చేసిన ఉద్యోగం మానేయడం, ప్రిపరేషన్ సమయంలో ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు రవికుమార్ తెలిపారు.

55
ఓ కుర్రాడి విజయంలో అన్న క్యాంటీన్ ప్రాత...
Image Credit : Getty

ఓ కుర్రాడి విజయంలో అన్న క్యాంటీన్ ప్రాత...

డిఎస్సి ప్రిపరేషన్ లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒత్తిడికి లోనయ్యాను.. ఈ సమయంలోనే అన్న క్యాంటిన్ తన ఆకలిబాధను తీర్చాయని రవికుమార్ పేర్కొన్నాడు. ఉదయం, సాయంత్రం అన్న క్యాంటిన్ లో ఆకలి తీర్చుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాను... ఇవి తన ఫైనాన్షియల్ ఒత్తిడిని కొంతమేర తగ్గించాయన్నారు. ఇలా తన విజయంలో అన్న క్యాంటిన్ల పాత్ర మరిచిపోలేనిదని రవికుమార్ చెప్పుకొచ్చారు.

ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్
ఉద్యోగ సాధనకు అండగా నిలిచింది

దాచేపల్లి మండలం ముత్యాలంపాడుకి చెందిన నేను కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన‌ డీఎస్సీ నోటిఫికేష‌న్ కోసం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ప్రిపేర్ అయ్యాను. ఈ స‌మ‌యంలో నా ఆక‌లి తీర్చిన‌ అన్న క్యాంటీన్‌, ఉద్యోగ సాధ‌న‌కు అండ‌గా నిలిచింది.… pic.twitter.com/b6znZIWJsv

— Telugu Desam Party (@JaiTDP) August 27, 2025

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
ఫీల్ గుడ్ న్యూస్
విద్య
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏపీ డీఎస్సీ నియామకాలు
ఏషియానెట్ న్యూస్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
ఒంగోలు పర్యటనలో లోకేష్ ఫాన్స్ ఫాలోయింగ్ చూడండి | Nara Lokesh Ongole Tour
Recommended image2
Now Playing
ఏపీ గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు కీలక ప్రెస్ మీట్| Nagababu Appointed AP Green Committee Chairman
Recommended image3
Now Playing
Chilakaluripet Road Incident: ప్రైవేట్ బస్సు - ఆటో ఢీ.. 7 గురు మృతి! | Asianet Telugu
Related Stories
Recommended image1
Success story: టీ షాప్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న 27 ఏళ్ల యువకుడు.. సక్సెస్ సీక్రెట్ ఏంటంటే?
Recommended image2
Success story: ఇది క‌దా స‌క్సెస్ అంటే.. గొర్రెల కాప‌రి కుర్రాడు UPSC కొట్టేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved