MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Andhra Pradesh
  • Mark Shankar: అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడికి గాయాలు.. స్కూల్లో జరిగింది ఇదేనా?

Mark Shankar: అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడికి గాయాలు.. స్కూల్లో జరిగింది ఇదేనా?

సమ్మర్ క్యాంపు లో పిల్లల అభిరుచి బట్టి రకరకాల ఆక్టివిటీస్ ఉంటాయి .వంట నేర్పడం ఇందులో ఒకటి .వంట సృజనతో కూడినది .వంట నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది . 

3 Min read
Author : Amarnath Vasireddy
Published : Apr 09 2025, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

సింగపూర్ ...ప్రతి చిన్న విషయంలో అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలను పాటించే దేశం .అక్కడ టమాటో స్కూల్ అనే పేరున్న ఒక సంస్థ పిల్లలకు వేసవి సెలవుల్లో వంట క్లాసులు నిర్వహిస్తోంది .సింగపూర్ లో నాలుగు చోట్ల ఈ సమ్మర్ క్యాంపు జరుగుతోంది .
పిల్లలకు వంట క్లాసులు ఎందుకు అని ఎవరికైనా సందేహం రావచ్చు. మన దేశంతో కలిపి అనేక దేశాల్లో అకాడమిక్ ఇయర్...  మార్చ్ కే పూర్తయ్యింది . { సిబిఎస్సీ ఐసిఎస్సీ ఐబి లాంటి బోర్డ్స్ } . రెండు  నెలలు వేసవి సెలవులు .ఇంట్లో వదిలేస్తే పిల్లలు స్మార్ట్ ఫోన్స్ లాంటి వాటికి బాగా అడిక్ట్ అయ్యే ప్రమాదం .దీనితో సమ్మర్ క్యాంపు కోసం చాలా మంది తల్లితండ్రులు చూస్తారు .

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
kitchen cooking

kitchen cooking

సమ్మర్ క్యాంపు లో పిల్లల అభిరుచి బట్టి రకరకాల ఆక్టివిటీస్ ఉంటాయి .వంట నేర్పడం ఇందులో ఒకటి .వంట సృజనతో కూడినది .వంట నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది . టీం వర్క్ అలవాటు అవుతుంది. చిన్న వయసులోనే...  అందునా అబ్బాయిలకు సైతం వంట నేర్పడం మంచి పని . టమాటో స్కూల్ సింగపూర్ సమ్మర్ క్యాంపు 3  మార్చ్ నాడు మొదలయ్యింది .మే 16 దాక కొనసాగాల్సి ఉంది.

ఆరు నుంచి 14  ఏళ్ళ పిల్లలకు ఈ ఈస్టర్ కుక్కింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు .
సోమవారం -- బన్స్ , బన్నీస్ , బ్రౌనీస్.
మంగళవారం - wraps  లేమోనెడ్
బుధవారం - పిజ్జా 
గురువారం - పాన్ కేక్ సిన్నమోన్ రోల్స్ 
శుక్రవారం . కప్ కేక్ 
 వారం లో ఒక్కో రోజు ఒక్కో వంటకం నేర్పుతారు . ఫీజు సుమారు గా నలబై వేల రూపాయిలు .వేసవి లో సింగపూర్ చూసినట్టు ఉంటుంది . 
ప్రపంచం లోని భిన్న సంస్కృతుల పిల్లలతో మమేకం అయినట్టు ఉంటుంది . కాస్త డబ్బున్న కుటుంబాల తల్లితండ్రులు దీని వైపు ఆకర్షితుల కావడం సహజం .నిన్న కుకరీ క్లాసులో భాగంగా ఈస్టర్ ఎగ్ సలాడ్ శాండ్విచ్ చేసారు . ఇందులో భాగంగా పిలల్లు కోడి గుడ్లను 
ఉడక బెట్టాలి .సింగపూర్ లో జరుగుతున్న నాలుగు  సమ్మర్ క్యాంప్స్ లో రివర్ వాలీ రోడ్ లో ఉన్న షాపుహౌస్ అనే చోట అగ్ని ప్రమాదం జరిగింది . 
అగ్ని ప్రమాదానికి కారణం ఇది అని ఇంకా అధికారులు ప్రకటించలేదు .
 

33

నా గెస్ ప్రకారం స్టవ్ టాప్ వుపయోగించి ఉంటారు.ఎక్కడో ఎవరో అబ్బాయి లేదా అమ్మాయి .. పాపం చిన్న వయసు .. ఎగ్స్ ను ఓవర్ హీట్ చేసి ఉంటారు .అలా జరిగితే ఎగ్స్ పగిలి చుట్టుపక్కల మంటలు అంటుకునే ప్రమాదం . ఈ మధ్య  కాలం లో హైపర్ ఆక్టివిటీ పిల్లల సంఖ్య పెరుగుతోంది . వీరు ఒక్క చోట నింపాదిగా వుండరు .టీచర్ ఒకటి చెబితే ఇంకోటి చేస్తారు . ఇలాంటి అబ్బాయి లేదా అమ్మాయి క్యాంపు లో ఉన్నారేమో తెలియదు .చుట్టుపక్కల బ్రెడ్ లాంటి సులభంగా మంటలు అంటుకునే పదార్థాలు ....  ఎప్పుడైతే వేడి పెరిగి ఎగ్స్ పేలాయో అప్పుడు మంటలు వ్యాపించి ఉంటాయి .

ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా ... ఒక్కో సారి ఇలాంటి ప్రమాదాలు .చేతులు కాళ్ళు కాలడం కన్నా ఊపిరి తిత్తుల్లోకి పొగ వెళ్లడం ప్రమాదకరం .
 అది తక్కువ మొత్తం లో అయితే పెద్దగా సమస్య లేదు . కానీ ఎక్కువ మొత్తం లో ఎక్కువ సేపు అయి ఉంటే సమస్య జటిలం .
 సింగపూర్ లో అత్యుత్తమ వైద్యం ఇస్తారు అనుకోండి .ఒక్కో సారి కష్టాలు కట్ట కట్టుకొని వస్తాయి .తండ్రికి అంకోలిసింగ్ స్పాండిలైటిస్ .అంటే ఆటో ఇమ్యూన్ సమస్య. జఠిలమైనది .చిన్న పిల్లాడికి అదీ ...  సమ్మర్ .. సింగపూర్ .. కుక్కింగ్ క్లాసులు అని పంపితే .. అగ్ని ప్రమాదం .
ఒక్కో సారి కొన్ని విషయాలను సైంటిఫిక్ గా వివరించలేము .
 నా మాటకు నేను ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మోసం  చేయని  సిద్ధాంతి ని  కలిసి శాంతి జరిపించే ప్రయత్నాలు చేస్తాను . 
అంతా మంచే జరగాలి .

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
ఆహారం
పవన్ కళ్యాణ్
చిన్నారుల సంరక్షణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image2
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Recommended image3
Now Playing
APకి బ్రాండ్ అంబాసిడర్ CBN స్పీచ్ అదరగొట్టిన నిమ్మల| Nimmala Ramanaidu Speech | NTR Bharosa Pensions
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved