Revanth Reddy: ఎవరైనా సరే అస్సలు తగ్గకండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు..

తెలంగాణలో అక్రమ ఇసుక దందాపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ ఖజానాకు దెబ్బ కొడుతూ, రెచ్చి పోతున్న ఇసుక దందా చేస్తున్న వారిని అస్సలు వదిలి పెట్టమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతోన్న అక్రమ ఇసుక రవాణపై ఉక్కుపాదం మోపే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో నిర్వహించిన మైనింగ్ సమీక్షల్లో ఇందిరమ్మ ఇండ్లుకు ఉచిత ఇసుక ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధికారులు ఆదేశాలు కూడా జారి చేశారు.
అయితే తాజాగా ఇసుక దందా అలాగే కొనసాగుతుండడంతో రేవంత్ ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను స్పష్టమైన ఆదేశాలు జారి చేశారు. ఇసుక రీచ్ లను తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారు ఎవరైనా, వారి వెనకాల ఎవరున్న సరే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సర్కార్ ఖజానాకు గండి కొడుతున్న వారికి …. సహకరించవద్దని…. ప్రజా ప్రతినిధులకు సైతం గతంలోనే ఈ విషయాన్ని సీఎం తెలిపారు.
cm revanth reddy
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఇసుక రవాణా యథేశ్చగా సాగుతోంది. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్,వరంగల్, ఖమ్మం, నల్గొండ, పాలమూర్ జిల్లాల్లో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటిలో ఇసుక తవ్వాలంటే…. టిజీఎండీసీ అనుమతులు అవసరం. ఇసుక కొనుగోళ్ల ప్రక్రియ అంతా టిజీఎండీసీ అద్వర్యంలో అది కూడా ఆన్ లైన్ లో జరగాలి. అయితే…. టిజిఎండీసీ వెబ్ సైట్‌లో ఓపెన్ కాకుండానే… చాలా చోట్ల ఇసుక తరలిపోతుంది. తెలంగాణలోని పలు చోట్ల ఇసుక రీచ్‌ల నుంచి వందల కొద్ది లారీల్లో ఇసుక తరలిపోతుంది.
దొంగ బిల్లుటు పెడుతూ, ఓవర్ లోడ్‌తో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణను అరికట్టేందుకు సీఎం ముందడుగు వేశారు. ఇసుక అక్రమ రవాణాకు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకట్ట వేయాలని డిసైడ్ అయ్యారు. మరి రేవంత్ నిర్ణయంతో అయినా అక్రమ ఇసుక రవాణాకు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.
ఆ జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేపట్టండి: రేవంత్ రెడ్డి
ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మీసేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కార్డుల పంపిణీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం పలు డిజైన్లను పరిశీలించారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డును ఖరారు చేయనున్నారు.