ఊటూరు బ్యాంక్ దోపిడీ కేసు... 24గంటల్లోనే దొంగలు అరెస్ట్, వివరాలివే
First Published Dec 18, 2020, 2:02 PM IST
గత మంగళవారం రాత్రి దోపిడీ దొంగలు ఊటూరు ఎస్‌బిఐ బ్యాంకు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి డబ్బులు దొంగిలించడానికి విశ్వప్రయత్నం చేసినా డబ్బులు మాత్రం దోచుకోలేకపోయారు.

గత మంగళవారం రాత్రి సమయంలో ఊటూరు ఎస్‌బిఐ బ్యాంకులో దుండగులు దొంగతనానికి ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. బ్యాంకు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి డబ్బులు దొంగిలించడానికి విశ్వప్రయత్నం చేసినా డబ్బులు మాత్రం దోచుకోలేకపోయారు. ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించిన సిపి కమలాసన్ రెడ్డి బ్యాంకును సందర్శించి అడిషనల్ ప్రత్యేకమైన టీమును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం 24 గంటల్లో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

కమాన్పూర్ మండలం పేరపల్లి కి చెందిన దూలం రాజు, రాగడిమద్దికుంట సుల్తానాబాద్ కు చెందిన అతని బావ బాలసాని అజయ్, కమాన్పూర్ మండలం రొంపికుంటకు చెందిన మాడిశెట్టి రాకేష్ మరియు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పి రెడ్డిపల్లికి చెందిన వెన్నుపూసల రాకేష్ రెడ్డి నలుగురు కలిసి హైదరాబాద్ లో ఓ రూమ్ కిరాయి తీసుకుని పని చేసుకుంటూ ఉంటున్నారు. వారి పని ద్వారా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రాజు తన తండ్రి దూలం సంపత్ కు తెలుపగా అతను కూడా సరే అని ఒప్పుకున్నాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?