MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Pension Scheme : వచ్చేనెల నుంచే కొత్త పించన్లు.. ఇక నెలనెలా రూ.10,000, వారికి ఏకంగా రూ.15,000

Pension Scheme : వచ్చేనెల నుంచే కొత్త పించన్లు.. ఇక నెలనెలా రూ.10,000, వారికి ఏకంగా రూ.15,000

NTR Bharosa Pension Scheme : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేవలం రూ.4,000, రూ.6,000 మాత్రమే పెన్షన్ ఇస్తుందనే చాలామందికి తెలుసు. కానీ నెలనెలాా రూ.10,000, రూ.15,000 కూడా అందిస్తుంది… ఈ పెన్షన్ కు ఎవరు అర్హులో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : May 15 2026, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్..
Image Credit : Gemini AI

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్..

Pension Scheme : సమాజంలో ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో బ్రతికే హక్కు ఉంది... అందుకే ప్రభుత్వాలు ఆర్థికంగా వెనకబడిన పేదలకు వివిధ పథకాల ద్వారా సాయం చేస్తున్నాయి... ఇక శారీరక శ్రమ చేయలేని వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందిస్తున్నాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ను అమలుచేస్తోంది. 

ప్రతి నెల వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, కళాకారులు, HIVతో జీవిస్తున్న వ్యక్తులు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్‌జెండర్లు, డప్పు కళాకారులకు నెలనెలా రూ.4000 పెన్షన్ అందిస్తోంది కూటమి ప్రభుత్వం. అలాగే దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ అందిస్తోంది కూటమి ప్రభుత్వం.

చాలామందికి తెలిసింది ఈ పెన్షన్ల గురించే... కానీ ప్రభుత్వం మరికొందరికి కూడా ప్రభుత్వం సామాజిక పెన్షన్లు అందిస్తోంది. అదీ నెలకు ఏ 4 వేలో, 6 వేలో కాదు ఏకంగా 10 వేలు, 15 వేలు. ఇంత భారీ పెన్షన్లకు ఎవరు అర్హులు..? ఎలా పొందాలి..? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రూ.10000 వేల పెన్షన్ ఎవరికి..?
Image Credit : Asianet News

రూ.10000 వేల పెన్షన్ ఎవరికి..?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే వృద్ధులు, వికలాంగులకే కాదు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేకపోతున్నవారికి కూడా పెన్షన్లు అందిస్తోంది. ఇలా బోదకాలు, కుష్టు వ్యాధులతో పాటు మూత్రపిండాలు, కాలేయం, గుండె సమస్యలతో బాధపడేవారికి ఏకంగా రూ.10,000 పెన్షన్ అందిస్తోంది. తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా, హిమోఫీలియా వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ పెన్షన్ లభిస్తుంది.

అయితే గత ఏడాది నుండి ఇప్పటివరకు ఈ రూ.10000 పెన్షన్ కోసం 965 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి వచ్చేనెల జూన్ లో పెన్షన్ అందించనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ, వార్డు కార్యాలయాల సిబ్బంది నేరుగా వీరి ఇంటికే వెళ్లి పెన్షన్ డబ్బులు అందించనున్నారు. ఈ పెన్షన్ల మంజూరుతో ప్రభుత్వానికి ప్రతినెలా రూ.93 లక్షలకు పైగా అదనపు భారం పడుతుంది.

33
రూ. 15,000 వేల పెన్షన్ ఎవరికి..?
Image Credit : ChatGPT

రూ. 15,000 వేల పెన్షన్ ఎవరికి..?

ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏ పనీ చేయలేకపోతున్నవారిని దివ్యాంగులుగానే పరిగణించాలని నిర్ణయించింది... వీరినికేంద్ర దివ్యాంగుల చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. అంటే వీరికి కూడా దివ్యాంగుల మాదిరిగానే సదరం సర్టిఫికేట్ అందిస్తారన్నమాట. దీంతో వీరు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పెన్షన్ పొందవచ్చు.

ఇలా పక్షపాతంతో, తీవ్ర కండరాల వ్యాధులతో మంచానికే పరిమితమైనవారి కూడా పెన్షన్ అందించనుంది కూటమి ప్రభుత్వం. మిగతా దీర్ఘకాల వ్యాధిగ్రస్తుల కంటే ఎక్కువగా నెలనెలా రూ.15,000 అందించనున్నాయి. సదరం సర్టిఫికేట్ పొందిన తర్వాతి నెలనుండే ఈ పెన్షన్లు అందించనుంది ప్రభుత్వం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AP Local Body Elections 2026 : మేయర్, మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు... ఎక్కడ, ఎవరికి అవకాశమో తెలుసా?
Recommended image2
Rice: డీమార్ట్ కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
Recommended image3
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఈ యాప్ ప్రత్యేకతలు ఇవే
Related Stories
Recommended image1
Pension Scheme : అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ. 7 పొదుపు చేస్తే నెలకు రూ. 5000 పెన్షన్ !
Recommended image2
Atal Pension Yojana: రోజుకు రూ. 10 క‌డితే.. రూ. 5 వేల పెన్ష‌న్‌, త‌ర్వాత రూ. 8 ల‌క్ష‌ల గ్యారెంటీ రిట‌ర్న్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved