వైఎస్ఆర్‌తో సంబంధాలు: పెద్దిరెడ్డికి అదే టర్నింగ్‌పాయింట్

First Published 9, Jun 2019, 3:06 PM

ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి  దూరం....... ఆ తర్వాత  అదే కుటుంబానికి దగ్గరగా మారినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవులు దక్కాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్‌ మంత్రివర్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పదవి దక్కింది.

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రబల శక్తిగా ఎదిగారు. సామాన్య కుటుంబం నుండి జిల్లా రాజకీయాలను శాసించే శక్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదిగారు.

1978లో పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి సైపుల్లా బేగ్‌పై ఓటమి చవిచూశారు.1980లో చౌడేపల్లె సమితి అధ్యక్ష ఎన్నికల్లో నూతనకాల్వ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయాడు.

ఆ తర్వాత ఆయన రాజకీయాలకు కొంత దూరంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీలేరు నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి చల్లా రామచంద్రారెడ్డిపై విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేత చెంగారెడ్డి వర్గంలో చేరారు. 1994లో టీడీపీ అభ్యర్ధి జీవీ శ్రీనాధరెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 1999లో ఆయనపైనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు.

తొమ్మిదేళ్ల పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ వెంట ఉండేవారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డితో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంతగా సంబంధాలు లేవు. ఈ కారణంగానే 2004లో వైఎస్ మంత్రివర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చోటు దక్కలేదనే రాజకీయ విశ్లేషకులు చెబుతారు.

ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరయ్యారు. దీంతో 2009లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ మంత్రివర్గంలో చోటు దక్కింది. రోశయ్య మంత్రివర్గంలో కూడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మాత్రం పెద్దిరెడ్డికి చోటు దక్కలేదు.

2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజనతో పీలేరు నుండి పుంగనూరుకు మారాడు. 2009లో పుంగనూరులో టీడీపీ అభ్యర్ధి ఎం. వెంకటరమణరాజుపై 42 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేసిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి కూడ ఆయన వెంట నడిచారు. ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడ వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు.

2014, 2019 ఎన్నికల్లో పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. రాజంపేట ఎంపీ స్థానం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిధున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో, వైఎస్ జగన్ మంత్రివర్గంలో పెద్దిరెడ్డికి చాన్స్ దక్కింది.

loader