పాలనలోనూ పవన్ రికార్డులు ... ఆయన శాఖలకు అవార్డులే అవార్డులు
'వాడు ఎక్కడున్నా రాజేరా..'' బాహుబలి సినిమాలోని ఈ డైలాగ్ పవన్ కల్యాణ్ కు సరిగ్గా సరిపోతుంది. ఆయన హీరోగా, రాజకీయ నాయకుడిగానే కాదు పాలకుడిగానూ రికార్డుల మోత మోగిస్తున్నారు.
Pawan Kalyan
Pawan Kalyan : సినిమాలు, రాజకీయాల్లోనే కాదు పాలనలోనూ పవన్ కల్యాణ్ అదరగొడుతున్నారు. ఎలాంటి అనుభవం లేకపోయినా రెండుమూడు మంత్రిత్వ శాఖలను సమర్దవంతంగా నడిపిస్తున్నారు. ఓ వైపు పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ, మరోవైపు ఎన్డిఏ కూటమికి మద్దతుగా నిలుస్తూనే ఇంకోవైపు సుపరిపాలన అందిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ది, అటవీ పర్యావరణ, సైన్స్ ఆండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పవన్ పనితీరు భేష్ అనడానికి తాజాగా వచ్చిన అవార్డులే నిదర్శనం. ఏపీలోని పంచాతీలకు కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు దక్కాయి. ఈ క్రెడిట్ పవన్ కే దక్కుతుంది.
Pawan Kalyan
పవన్ శాఖలకు అవార్డుల పంట :
కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్నిరాష్ట్రాల పంచాయితీల పనితీరును పరిశీలించి అత్యుత్తమమైన వాటికి అవార్డులు అందిస్తుంది. ఇలా ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్’ లను పంచాయితీలను అందిస్తుంది. అయితే ఈసారి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన నాలుగు పంచాయితీలు వివిధ విభాగాల్లో ఈ అవార్డులను దక్కించుకున్నాయి.
దేశంలోనే ఆరోగ్యవంతమైన పంచాయితీ విభాగంలో చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం అవార్డు కైవసం చేసుకుంది. ఇక సమృద్దికరంగా జలవనరుల (వాటర్ సఫిషియెంట్) విభాగంలో అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి, పచ్చదనం-పరిశుభ్రత (క్లీన్ అండ్ గ్రీన్) విభాగంలో అనకాపల్లి జిల్లాలోని తగరంపూడి టాప్ లో నిలిచాయి. చివరగా సామాజిక న్యాయం-సామాజిక రక్షణ (సోషల్లీ జస్టిస్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్) పంచాయత్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళకు అవార్డు దక్కింది.
ఈ అవార్డులు పవన్ కల్యాణ్ పనితీరు ఎలావుందో తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఒకేసారి రాష్ట్రంలోని పంచాయితీలన్నింటికి గ్రామసభలు నిర్వహించి రికార్డ్ సృష్టించారు పవన్. ఇప్పుడు మరోసారి అవార్డుల ద్వారా తన పనితీరు ఎంత అద్భుతంగా వుందో తెలియజేసారు.
Pawan Kalyan
అవార్డ్ పొందిన పంచాయితీలకు పవన్ అభినందనలు :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పురస్కారాలు పొందిన పంచాయతీలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని... ఈ క్రమంలోనే రాష్ట్రంలో పంచాయతీలు అనేక విజయాలు సాధిస్తున్నాయని అన్నారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటోందన్నారు.
తాజాగా మన పంచాయితీలు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు సాధించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఇలా అవార్డులు పొందిన పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు, సిబ్బందికీ అభినందనలు చెబుతున్నానని అన్నారు. క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల పాలనను బలోపేతం చేసి సుస్థిర అభివృద్ధి సాధనకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. అందువల్లే మన రాష్ట్ర గ్రామ పంచాయతీలు దృఢ చిత్తంతో, అంకిత భావంతో పని చేస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.