పవన్ కళ్యాణ‌్‌ను వెంటాడుతున్న అన్నయ్య ప్రజారాజ్యం

First Published 13, May 2019, 2:51 PM IST

ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా తాను పార్టీని విలీనం చేయనని... ఫలితం ఎలా ఉన్నప్పటికీ ప్రజల కోసం పనిచేస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పదే పదే ఆ పార్టీ శ్రేణులకు నొక్కి చెబుతున్నారు.ప్రజారాజ్యం పార్టీలో ఆనాడు చోటు చేసుకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.

2008 ఆగష్టు మాసంలో మెగాస్టార్ చిరంజీవి తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పోటీ చేసి 18 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొంది. ఆ ఎన్నికల్లో ఏపీలో రెండో సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ఎక్కువ కాలం పాటు నడపలేకపోయారు  ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టింది. రాష్ట్ర విభజనకు ముందు నుండి చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో పాటు క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

2014 ఎన్నికలకు ముందు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్  టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుపలికారు. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో జనసేన, సీపీఐ, సీపీఎంలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి.

రాష్ట్రంలో రెండు కుటుంబాలే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలా.... వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి దక్కాలా.... కానిస్టేబుల్ కొడుకు సీఎం కాకూడదా అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.  అయితే జనసేన పార్టీని కూడ ప్రజారాజ్యం మాదిరిగానే ఏదో ఒక పార్టీలో విలీనం చేస్తారని  ప్రత్యర్థులు ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని పవన్ కళ్యాణ్‌ సహా ఆ పార్టీ నేతలు ఖండించారు.

ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు అమరావతిలో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో కూడ ప్రజారాజ్యం పార్టీ గురించి ప్రస్తావన వచ్చింది. ప్రజారాజ్యం పార్టీలో ఆనాడు చోటు చేసుకొన్న పరిణామాలను పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ప్రస్తావించారు.  ప్రజారాజ్యం తరహాలోనే జనసేన పార్టీ కూడ ఏదో ఒక రోజు ఏదో పార్టీలో విలీనమయ్యే రోజులు ఉన్నాయనే ప్రచారంపై పవన్ కళ్యాణ్ తేల్చి పారేశారు. ఫలితాలు ఎలా ఉన్నా కూడ తాను పార్టీని నడుపుతానని తేల్చి చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఆ పార్టీలో చేరిన వారంతా కూడ అనేక ఆశలతోనే పార్టీలో చేరారని ఆయన గుర్తు చేశారు.

కానీ తాను ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే పార్టీని ఏర్పాటు చేసినట్టుగా ఆయన పార్టీ శ్రేణులకు గుర్తు చేస్తున్నారు. పార్టీకి ఎలాంటి ఫలితం వచ్చినా లెక్క చేయకుండా  ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎన్ని పోరాటాలు చేశామనే విషయాన్ని మాత్రమే తాను చూస్తానని పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు.

ప్రజారాజ్యంలో ఆ రోజుల్లో చోటు చేసుకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ కేంద్రీకరంచారు. గత అనుభవాల రీత్యా మరోసారి అదే రకమైన పొరపాట్లు జరగకుండా ఆయన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా సరే ప్రజల కోసం పనిచేస్తామని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.

ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా కూడ వాటిని స్వీకరించేందుకు ఆయన సన్నద్దమయ్యారని తేలిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడ ఆయన పార్టీ నేతలతో చర్చించారు. మరో వైపు భవిష్యత్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకొన్నారు.

loader