జగన్ రెడ్డిది పచ్చి నెత్తురు తాగే ఫ్యాక్షనిజం.. మాది హ్యూమనిజం.. : నారా లోకేష్
మాది మానవత్వం.. జగన్ ది ముఠాతత్వం అంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ విరుచుకుపడ్డారు. అన్నా క్యాంటిన్లను మూసేసి పేదవాడి నోటికాడ కూడు తీసేశాడన్నారు.

అమరావతి : జగన్ ను సైకో ముఖ్యమంత్రి అంటూ నారా లోకేష్ మరోసారి విరుచుకుపడ్డాడు. ‘పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను రద్దు చేశాడు.. అభాగ్యుల నోటి కాడ కూడు లాగుతాడు సైకో ముఖ్యమంత్రి’ అని మండపడ్డారు.
తాను పేదవాడు పక్షమని వైయస్ జగన్ వేదిక దొరికినప్పుడల్లా ఉపన్యాసాలు దంచేస్తాడు. కానీ చేసేది మాత్రం ఇలాంటి పనులు. జగన్ రెడ్డి సిద్ధాంతం పచ్చి నెత్తురు తాగే ఫ్యాక్షనిజం. జగన్ రెడ్డి సిద్ధాంతం పచ్చి నెత్తురు తాగే ఫ్యాక్షనిజం.. మాది సకలజనులు సుభిక్షంగా ఉండాలనే హ్యూమనిజం’ అని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
యువగళం పాదయాత్రలో భాగంగా నులకపేటలో తాను ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ దగ్గర నారా లోకేష్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ సందర్భంగానే ఈ విధంగా వ్యాఖ్యానించారు. గురువారం యువగళం పాదయాత్ర 157వ రోజుకు చేరుకుంది.
గురువారం నాడు మంగళగిరి శివారులో ఉన్న శిబిరం నుంచి నులకపేట ప్రకాష్ నగర్ తాడేపల్లి మీదుగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉండవల్లి వరకు సాగింది.
YS Jagan
గురువారం ఏపీలో పలుచోట్ల వర్షం పడింది. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న ప్రాంతంలోనూ వర్షం పడగా వర్షంలో తడుస్తూనే ప్రజల సమస్యలు విన్నారు. వారికి హామీ ఇస్తూ లోకేష్ ముందుకు సాగారు.
ఇదిలా ఉండగా శుక్రవారం నాడు నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు. మంగళగిరి కోర్టులో వైసీపీ నాయకులపై నారా లోకేష్ వేసిన కేసులో వాంగ్మూలమిచ్చేందుకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే పాదయాత్రకు విరామం ప్రకటించారు.
తిరిగి 19వ తేదీ సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని 300 కుటుంబాలు వైసీపీ నుంచి టిడిపిలో చేరాయి.
మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన పాదయాత్ర విడదీ కేంద్రంలో నిడమర్రు, తాడేపల్లి, నవులూరు, ఎర్రబాలెం, మంగళగిరి, కృష్ణాయ పాలెం గ్రామాలకు చెందిన నాయకులు నారాలోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు.