MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • Holidays : తెలుగు స్టూడెంట్సే కాదు ఎంప్లాయిస్ కూడా ఎగిరిగంతేసే న్యూస్.. మళ్లీ వరుసగా నాల్రోజుల సెలవులు, లాంగ్ వీకెండ్

Holidays : తెలుగు స్టూడెంట్సే కాదు ఎంప్లాయిస్ కూడా ఎగిరిగంతేసే న్యూస్.. మళ్లీ వరుసగా నాల్రోజుల సెలవులు, లాంగ్ వీకెండ్

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులకు ఈ నెలాకరులో భారీగా సెలవులు వస్తున్నాయి… ఒకటి రెండ్రోజులు కాదు ఏకంగా నాల్రోజుల హాలిడేస్ ఉన్నాయి. సడన్ ఈ సెలవులెందుకో తెలుసా?  

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 17 2026, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగోళ్లకు సెలవులే సెలవులు
Image Credit : Chat GPT

తెలుగోళ్లకు సెలవులే సెలవులు

Holidays : సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు దసరా, సంక్రాంతి పండగలకు వరుస సెలవులు వస్తుంటాయి. కానీ ఈసారి ఎవ్వరూ ఊహించని విధంగా మొహర్రం పండక్కి ఈ స్థాయిలో సెలవులు వస్తున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో భారంగా స్కూళ్లకి వెళుతున్న తెలుగు విద్యార్థులు ఈ మొహర్రం సెలవుల గురించి తెలిసి ఎగిరి గంతేస్తున్నారు. ఈసారి మొహర్రం సెలవు వీకెండ్ తో కలిసివస్తోంది... కాబట్టి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వరస సెలవులు కలిసివస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆంధ్ర ప్రదేశ్ లో మొహర్రం హాలిడే ఎప్పుడు..?
Image Credit : AI

ఆంధ్ర ప్రదేశ్ లో మొహర్రం హాలిడే ఎప్పుడు..?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం (2026) ఆరంభంలో ప్రకటించిన హాలిడే లిస్ట్ లో మొహర్రం సెలవు జూన్ 25న ఉంది. అయితే దేశవ్యాప్తంగా మొహర్రం వేడుకలు జూన్ 26న జరుపుకుంటున్నారు... అందుకే రాష్ట్ర ప్రజలు, వక్ఫ్ బోర్డ్ అభ్యర్థన మేరకు ఈ సెలవులను మార్చింది ప్రభుత్వం.

గతంలో జూన్ 16న (మంగళవారం) ఐచ్చిక సెలవుగా ప్రకటించింది... దీన్ని మొహర్రం ముందురోజు జూన్ 25కి మార్చింది కూటమి ప్రభుత్వం. అంటే మొహర్రం వేడుకలు జరుపుకునేవారు ముందస్తు అనుమతితో జూన్ 25 (గురువారం) వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ఇదే సమయంలో గతంలో జూన్ 25 ను మొహర్రం సాధారణ సెలవుగా ప్రకటించగా దీన్ని జూన్ 26కి మార్చింది... ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

35
మొహర్రంకి వరుసగా నాల్రోజులు సెలవులే..
Image Credit : Gemini AI

మొహర్రంకి వరుసగా నాల్రోజులు సెలవులే..

జూన్ 25న మొహర్రం ముందురోజు ఐచ్చిక సెలవు ఇచ్చింది ప్రభుత్వం... ఈ సెలవు తీసుకునే ఉద్యోగులకు వరుసగా నాల్రోజుల హాలిడేస్ కలిసివస్తున్నాయి. జూన్ 26న ఎలాగూ మొహర్రం పండక్కి సాధారణ సెలవుంది... కాబట్టి ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. ఇక కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది... ఇలాంటివారికి నాల్రోజుల సెలవులు వస్తున్నాయి... వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది.

బ్యాంక్ ఉద్యోగులకు కూడా మొహర్రం సెలవు కలిసివస్తోంది. జూన్ 26 (శుక్రవారం) పండగ సెలవు అయితే జూన్ 27న నాలుగో శనివారం కాబట్టి బ్యాంకులకు సెలవుంది. ఇక జూన్ 28 ఎలాగూ ఆదివారమే. అంటే ఏపీలోని బ్యాంక్ ఉద్యోగులకు మొహర్రం పండక్కి మూడ్రోజుల సెలవులు వస్తున్నాయి.

45
ఏపీ విద్యార్థులకు మొహర్రం సెలవులు ఎన్నిరోజులు?
Image Credit : Getty

ఏపీ విద్యార్థులకు మొహర్రం సెలవులు ఎన్నిరోజులు?

ఆంధ ప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం వంటి పట్టణాల్లో కొన్ని విద్యాసంస్థలకు ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది. ఇలాంటి స్కూల్స్ లో చదివే విద్యార్థులకు మొహర్రంకి వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తాయి. జూన్ 26 (శుక్రవారం) మొహర్రం పబ్లిక్ హాలిడే కాగా జూన్ 27,28 (శని, ఆదివారం) వీకెండ్ సెలవులు.

శనివారం సెలవులేని విద్యాసంస్థలకు శుక్రవారం (జూన్ 26) ఒక్కరోజే మొహర్రం హాలిడే. జూన్ 27 (శనివారం) యధావిధిగా స్కూల్స్ నడుస్తాయి. తిరిగి జూన్ 28 (ఆదివారం) సెలవు ఉంటుంది. శనివారం లీవ్ పెడితే వీరికి కూడా వరుసగా మూడ్రోజుల సెలవులు వస్తాయి.

55
తెలంగాణలో మొహర్రం హాలిడేస్ ఎన్నిరోజులు?
Image Credit : Getty

తెలంగాణలో మొహర్రం హాలిడేస్ ఎన్నిరోజులు?

తెలంగాణలో కూడా కొందరు ఉద్యోగులు వరుసగా నాల్రోజులు మొహర్రం సెలవులు ఎంజాయ్ చేయవచ్చు. హైదరాబాద్ ఓల్డ్ సిటీతో పాటు ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొహర్రం వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు మొహర్రం ముందురోజు (జూన్ 25) ఐచ్చిక సెలవు పొందవచ్చు.

జూన్ 26 (శుక్రవారం) మొహర్రం పండగ నేపథ్యంలో పూర్తిస్థాయి సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇక శని, ఆదివారం కూడా కొందరికి సెలవే... కాబట్టి వరుసగా నాల్రోజుల సెలవులు కలిసివస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని విద్యాసంస్థలకు మూడ్రోజులు (జూన్ 26,27,28), మరికొన్నింటికి జూన్ 26, జూన్ 28న మాత్రమే మొహర్రం సెలవులున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Recommended image2
Now Playing
మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Recommended image3
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Related Stories
Recommended image1
School Holidays 2026-27 : ఈ అకడమిక్ ఇయర్ లో 87 రోజులు సెలవులే.. తెలుగు స్టూడెంట్స్ కి ఏ నెలలో ఎన్ని సెలవులు?
Recommended image2
Bank Holidays : జూన్ సెకండాఫ్ లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఏ రాష్ట్రంలో, ఏరోజు, ఎందుకు సెలవో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved