- Home
- Andhra Pradesh
- Nara Lokesh: ఏపీ లోని విద్యార్థులు, తల్లిదండ్రులు రెడీగా ఉండండి..ముహుర్తం ఈ నెల 10 నే!
Nara Lokesh: ఏపీ లోని విద్యార్థులు, తల్లిదండ్రులు రెడీగా ఉండండి..ముహుర్తం ఈ నెల 10 నే!
జులై 10న ఏపీ పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా పీటీఎం 2.0. విద్యార్థుల ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలపై సమీక్ష నిర్వహించనున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మెగా పీటీఎం 2.0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో జూలై 10న ప్రత్యేక కార్యక్రమంగా 'మెగా పీటీఎం 2.0' నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య నేరుగా మట్లాడే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశాలు జరుగనున్నాయి.
ప్రోగ్రెస్ కార్డులు
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమరావతిలోని ఉండవల్లి నివాసంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో పాఠశాలల్లో విద్యా నాణ్యత, పథకాల అమలు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, క్లాస్‌లు ఎలా నిర్వహించాల్సినదీ వంటి అంశాలపై చర్చించారు.ఈ సమావేశాల్లో ప్రధానంగా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు తల్లిదండ్రులకు అందించనున్నారు. వీటిలో విద్యార్థుల హాజరు శాతం, సామర్థ్యాలు, పాఠ్య ప్రగతిపై స్పష్టమైన సమాచారం ఇవ్వనున్నారు. పిల్లల అభివృద్ధిపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకునేందుకు ఈ సమావేశాలు మేలు చేస్తాయని భావిస్తున్నారు.
ఆటిజం సమస్య
పర్యావరణ అవగాహనను పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొక్కలు నాటే, పరిరక్షించే విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపుగా 'గ్రీన్ పాస్‌పోర్ట్'లు ఇవ్వాలని సూచనలొచ్చాయి.ఆటిజం సమస్యతో బాధపడుతున్న విద్యార్థుల కోసం రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన 125 ఆటిజం కేంద్రాల ఏర్పాటుపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో భవిత సెంటర్లను పునరుద్ధరించేందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
కొత్త విశ్వవిద్యాలయాలు
రాష్ట్రంలో ఉన్న ఖాళీ టీచర్ పోస్టులకు సంబంధించి ఇటీవల నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు నెలలోగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే హైస్కూల్ ప్లస్ శ్రేణుల్లో అధ్యాపకుల నియామకాలు పూర్తి చేసి, షెడ్యూల్ ప్రకారం ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్రంలో కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న సంస్థలతో చర్చలు జరిపి, వాటిని వేగంగా అమలులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లోని దూర ప్రాంత పాఠశాలలకు మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అలాగే గిరిజన విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే మార్గాలపై అధ్యయనం చేసి, అవసరమైతే కొత్త భవనాలు నిర్మించాలని చెప్పారు.
నైపుణ్యాభివృద్ధి
అంతేకాదు, ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థుల సబ్జెక్టుల ఎంపికపై యూజీసీ నిబంధనల ఆధారంగా సరికొత్త విధానాలను చేపట్టాలని, విద్యార్థులపై భారం పడకుండా సూచించారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
నైపుణ్యాభివృద్ధిపై కూడా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలో ప్రారంభించనున్న 'నైపుణ్యం పోర్టల్' గురించి సమీక్షించి, సెప్టెంబరులోనే ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నారని వెల్లడించారు. ఈ వ్యవస్థలో రిజిస్ట్రేషన్ చేసిన వారందరికీ ఆటోమేటిక్‌గా రెజ్యూమే తయారయ్యే విధంగా సాంకేతిక పద్ధతులు రూపొందించాలని ఆదేశించారు.
రూ.600 కోట్లు మంజూరు
ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఐటీఐల అభివృద్ధికి కేంద్రం రూ.600 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా ఈ నిధులను వినియోగించాలని తెలిపారు.
ఈ మొత్తం కార్యక్రమాల వల్ల రాష్ట్రంలోని విద్యా రంగం బలోపేతం కానుందని, విద్యార్థుల భవిష్యత్తు దిశగా ప్రభుత్వం స్పష్టమైన దృష్టితో ముందుకెళ్తున్నదని అర్థమవుతోంది. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో పాఠశాలలు మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నదే ఈ కార్యక్రమాల ఉద్దేశంగా తెలుస్తోంది.