నేను బ్రహ్మంగారిని కాను : పవన్ కల్యాణ్ రాజకీయాలపై మంచు విష్ణు
పవన్ కళ్యాణ్ రాజకీయాలపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయభవిష్యత్తు గురించి చెప్పడానికి నేనేమైనా బ్రహ్మంగారినా అన్నారు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇద్దరూ టాలీవుడ్ లో ఉన్నత స్థాయికి ఎదిగారు. కాయాన్ని వీరిద్దరి మధ్య అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి. వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
నటుడు మోహన్ బాబు కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచి విష్ణు, తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అటు హీరోగా,, ఇటు సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు సాధించాడు. ఇటీవల తమ్ముడు మంచు మనోజ్ తో గొడవల నేపథ్యంలో కూడా కాంట్రావర్సీ గా మారాడు,
ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడిగా ఉన్నారు. ‘భక్తకన్నప్ప’ అనే సినిమా పనుల్లో బిజీగా కూడా ఉన్నారు మంచు విష్ణు. ఓ యూట్యూబ్ ఛానల్ కు మంచు విష్ణు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో వారు పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించారు.
దానికి సమాధానం చెబుతూ.. ‘పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనేమైనా బ్రహ్మంగారినా? అంటూ ప్రశ్నించారు. ‘పవన్ కళ్యాణ్ సినిమాల గురించి అడిగితే చెబుతాను’ అన్నారు.
సినిమాల్లో పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి ఆడకపోయినా మరో సినిమాలో ఆ లాస్ కవర్ అవుతుంది. అయితే రాజకీయాలకు వచ్చేసరికి.. ఆయన గురించి నేను ఏమి చెప్పలేను’ అన్నారు.
ప్రజలు రాజకీయాల విషయంలో చాలా స్మార్ట్ గా ఉంటారని మంచి విష్ణు చెప్పుకొచ్చాడు. అభిమాన హీరో సినిమా వస్తే చూస్తారు. అదే ఓటు వేయాల్సి వచ్చినప్పుడు మాత్రం…నచ్చిన వాళ్ళకి మాత్రమే ఓటేస్తారు అని మంచి విష్ణు అన్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావుడు లాంటి సినిమా రంగానికి చెందిన వారే రాజకీయాల్లో నిలబడలేకపోయారని గుర్తు చేశారు.
రాజకీయాల్లో తలలు పండిన లెజెండ్స్ ను కూడా ప్రజలు ఓడించాలని గుర్తు చేశారు. తమ దేశాన్ని, తమ గ్రామాన్ని, తమ జీవితాన్ని ఎవరైతే బాగు చేస్తారో.. బాగు చేస్తారని నమ్ముతారో వారి వైపే ప్రజలు ఉంటారు. పవన్ భవిష్యత్తు ఏంటనేది ఇంకో ఆరు నెలలు ఆగితే చెబుతానంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తాను భారీ బడ్జెట్ తో భక్త కన్నప్ప అనే సినిమా తీస్తున్నానని తన ఏకాగ్రత మొత్తం సినిమాలపైనే ఉందని మంచు విష్ణు చెప్పారు. ఈ సినిమా కోసం మార్కెట్కు మించి దాదాపు రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
చంద్రగిరి నుంచి మంచు విష్ణు పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అన్న దానికి సమాధానం చెబుతూ అందులో నిజం లేదన్నారు. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారని… వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ నే చంద్రగిరిలో నిలబడబోతున్నాడని సమాచారం ఉందన్నాడు.
మోహిత్ తనకు తమ్ముడని…చాలా అభిమానిస్తానని.. అవసరమైతే అతనికి సపోర్ట్ చేస్తానని మంచు విష్ణు అన్నాడు. ఇక ఏపీలో నవరత్నాల ప్రోగ్రాం చాలా బాగుందంటూ, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి అని జోస్యం చెప్పుకొచ్చారు. అనేక ఎన్నికల సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని గుర్తు చేశారు.