కర్నూల్ రోడ్డు ప్రమాదం... సంఘటనా స్థలంలో హృదయవిదారక దృశ్యాలు

First Published Feb 14, 2021, 8:58 AM IST

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి 44 పై జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాతపడగా మరో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. టెంపో వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి అదే వేగంతో రోడ్డుకు అటువైపుగా వెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.