MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • కేఏ పాల్ కు తిరుమల శ్రీవారి పేరు ... అదేంటో తెలుసా?

కేఏ పాల్ కు తిరుమల శ్రీవారి పేరు ... అదేంటో తెలుసా?

కేఏ పాల్ ... పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ స్థాయిలో మత బోధకుడిగా ఓ వెలుగు వెలుగిన ఆయన పుట్టుకతో క్రిిస్టియన్ కాదు ఓ హిందువు. తిరుమల లడ్డు వివాదంపై స్పందిస్తూ తల్లిదండ్రులు పెట్టిన పేరేంటో బయటపెట్టారు పాల్. అదేంటో తెలుసా?

3 Min read
Arun Kumar P
Published : Sep 26 2024, 08:55 PM IST| Updated : Sep 26 2024, 08:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tirumala Laddu

Tirumala Laddu

Tirumala Laddu Controversy : పవిత్రమైన తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడారంటూ స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బైటపెట్టారు. జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేధ్యాలు, భక్తులకు పంచే లడ్డులో ఉపయోగించారనేది ఆరోపణ. గత వైసిపి పాలనాకాలంలో ఈ అపచారం జరిగిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. కానీ మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు వైసిపి నాయకులు తమ హయాంలో ఏ తప్పూ జరగలేదని ... తిరుమల పవిత్రతకు భంగం కలిగించలేమని అంటున్నారు. ఇలా అధికార కూటమి, వైసిపి మధ్య తిరుమల లడ్డు విషయంలో సీరియస్ ఫైట్ సాగుతోంది. 

ఇలా తిరుమల లడ్డు వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తిరుమలపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ అంతా ఒక్కటే ... తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు అనేలా పాల్ మాట్లాడారు. కాబట్టి ఇకపై తిరుమల ఆలయంతో రాజకీయాలు చేయకుండా వుండాలంటే తాను చెప్పినట్లు చేయాలంటూ పాల్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. 
 

25
KA Paul

KA Paul

తిరుమల లడ్డు వివాదంపై కేఏ పాల్ ఏమన్నారంటే : 

తిరుమల పవిత్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేఏ పాల్ సూచించారు. తిరుమలను కలుపుకుని తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. ఇలా తిరుమలతో పాటు తిరుపతిని కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ...అప్పుడే ఈ ప్రాంతంతో రాజకీయాలు చేయడం ఆపగలమని అన్నారు. 

కేవలం 741 మంది మాత్రమే వున్న వాటికన్ సిటీని ప్రత్యేక దేశంగా ప్రకటించారు... అలాంటిది 34 లక్షల మంది హిందువులను కలిగిన తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే సమస్య ఏమిటని అన్నారు. వెంటనే తిరుపతిని యూటీగా ప్రకటించాలి...లేదంటే ప్రత్యేక దేశాన్నే డిమాండ్ చేస్తామంటూ కేఏ పాల్ బాండ్ పేల్చారు. 

ఇక తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వినియోగంపై రాజకీయాలు చేయడం ఆపాలని... ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరం వుందన్నారు. కాబట్టి ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని పాల్ డిమాండ్ చేసారు. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ విచారనే కొనసాగితే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశాలుండవు అనేలా కేఏ పాల్ మాట్లాడారు. 

35
ap high court

ap high court

తిరుమల లడ్డు వ్యవహారంపై హైకోర్టుకు కేఏ పాల్ : 

తిరమల లడ్డు వివాదంపై కేఏ పాల్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రస్తుతం రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని పాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి న్యాయస్థానమే కలుగజేసుకుని ఈ వివాదానికి తెరదించాలని ... నిజానిజాలు తేల్చాలంటూ పాల్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలుచేసారు.  

అయితే అతడి పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించలేదు. అంతగా అవసరం అనుకుంటే రెగ్యులర్ పిటిషన్ వేసుకోవాలని న్యాయస్థానం సూచించింది.
 

45
ka paul

ka paul

పవన్ కల్యాణ్ పై పాల్ సీరియస్ : 

తిరుమల లడ్డు వివాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ తీరును కేఏ పాల్ తప్పుబట్టాడు. బాధ్యతాయుతమైన పదవిలో వున్న పవన్ కల్యాణ్ పై శాంతి భద్రతలు కాపాడాల్సింది పోయి గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మధ్య వైషమ్యాలు సృష్టించేలా   రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని పాల్ ఆరోపించారు. 

పవన్ కల్యాణ్ మాటలను వినలేకపోతున్నామని... తాజాగా అతడి ప్రెస్ మీట్ ను 15 నిమిషాలు విని అలసిపోయానని అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్న ఆయన డిప్యూటీ సీఎం పదవికి అనర్హుడు... వెంటనే రాజీనామా చేయాలని పాల్  డిమాండ్ చేసారు. పవన్ చేతిలో అధికారం వుంది...  దాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేయాలన్నారు. ఇలాగే వ్యవహరిస్తే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావంటూ పవన్ ను పాల్ హెచ్చరించారు. 
 

55
ka paul

ka paul

కేఏ పాల్ అసలు పేరేంటో తెలుసా ? 

తిరుమల లడ్డు వివాదంపై స్పందిస్తూ కేఏ పాల్ ఆసక్తికరమైన విషయం ఒకటి బైటపెట్టారు. హిందూ కుటుంబంలో పుట్టిన కేఏ పాల్ పేరు శ్రీనివాస్ అట ... ఆయన తండ్రి తిరుపతికి తీసుకెళ్లి ఈ పేరు పెట్టారట. పాప నాశినిలో ముంచిమరీ తనకు శ్రీనివాస్ అని పేరు పెట్టారని స్వయంగా పాల్ వెల్లడించారు.

అయితే తాను మతం మారీ క్రిస్టియానిటీ తీసుకున్నానని... అప్పుడు కేఏ పాల్ గా పేరు మారిందన్నారు. తాను ఇప్పటికీ అన్ని మతాలను గౌరవిస్తారు... అందువల్లే ప్రపంచ శాంతి దూతగా  మారానని అన్నారు. తాను 200 కోట్ల ప్రపంచ జనాభాకు హీరోను అంటూ పవన్ కల్యాణ్ పై సీరియస్ కామెంట్స్ చేసారు పాల్. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
పవన్ కళ్యాణ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved