ఏడుకొండల వెంకన్న వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?
ఏడుకొండలవాడు.. శేషాచల వాసుడు.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు . ఆయ సిరి సంపదలను చూస్తేనే ఆయన వైభోగం తెలుస్తుంది. ఆయన వద్ద ఉన్న టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయంటారు.
ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలో జరిగిన అంతర్జాతీయ ఆలయాల సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో ధర్మారెడ్డి తిరుమల శ్రీవారి గురించి పలు ఆసక్తికర సమాచారం వెల్లడించారు. నిత్యం శ్రీవారి సేవలో పాల్గోనే వివిధ శాఖల సిబ్బంది విధివిధానాలు.. స్వామి వారికి ఎంత బంగారం ఉంది? ప్రసాదాల్లో ఎంత నెయ్యి వినియోగిస్తారో వివరించారు.
thirupathi temple
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 71 ఆలయాలను నిర్వహిస్తుందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామికి అలంకరించే బంగారు ఆభరణాలు 1.2 టన్నులు, వెండి 10 టన్నులు ఉంటుందని తెలిపారు. ఏడాదికి ఏడుకొండలవాడికి 500 టన్నుల పుష్పాలతో అలంకరణ చేస్తున్నారంట.
తిరుమల తిరుపతి దేవస్థానంలో 24,500 మంది ఉద్యోగులు ఉండగా, శ్రీవారిని దర్శించుకునే భక్తులకు సేవలందించడానికి రోజుకి 800 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. మహాప్రసాదంగా భావించే శ్రీవారి ప్రసాదాల(లడ్డు) తయారీకి ఏటా 500 టన్నుల నెయ్యి వినియోగిస్తారంట.
Tirumala
శేషాచల వాసుడు తితిదే పరిధిలో 600 ఎకరాల అటవీ ప్రాంతం ఉందని వివరించారు. అపర కుబేరుడు శ్రీవారి పేరిట రూ. 17వేల కోట్ల నగదు, 11 టన్నుల బంగారం బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు తెలిపారు.
ttd
శ్రీవారి సేవలో పనిచేసే.. వివిధ శాఖల సిబ్బంది విధివిధానాలకు వివరించారు. అంతర్జాతీయ ఆలయాల సమావేశం, ఎగ్జిబిషన్‌లో 30 దేశాల నుంచి వచ్చిన 1600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.