- Home
- Andhra Pradesh
- Family Suicide in Vijayawada: విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. దుర్గమ్మ దర్శనానికి వచ్చి..
Family Suicide in Vijayawada: విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. దుర్గమ్మ దర్శనానికి వచ్చి..
విజయవాడలో (Vijayawada) ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు (Family Suicide) పాల్పడటం కలకలం రేపింది. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన వీరు ఆత్మహత్య చేసుకున్నారు. కన్యకాపరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా.. తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో (Krishna River) దూకారు.

కృష్ణా నదిలో దూకిన తండ్రి, కుమారుడి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీశారు. మృతులను తెలంగాణలోని నిజమాబాద్ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
కన్యకాపరమేశ్వరి సత్రంలో రిజిస్టర్ చేసిన వివరాల ప్రకారం మృతులను సురేష్, అతని భార్య శ్రీలత, కొడుకులు అశిష్, అఖిల్‌గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.మృతులు ఈ నెల 6వ తేదీ సాయంత్రం కన్యకాపరమేశ్వరి సత్రంలో రూమ్ తీసుకున్నట్టుగా సత్రం నిర్వాహకులు తెలిపారు.
‘ఈరోజు ఉదయం నిజమాబాద్ నుంచి మృతులకు సంబంధించి వారు ఫోన్ చేసి.. సత్రంలో దిగిన మా వాళ్లు ఆత్మహత్య చేసుకోబోతున్నారని చెప్పారు. దీంతో వెంటనే సత్రం మేనేజర్ శ్రీధర్.. ఈ విషయాన్ని సత్రం చైర్మన్‌కు తెలియజేశారు. వెంటనే వారు ఉంటున్న రూమ్ వద్దకు వెళ్లి చూడగా.. శ్రీలత, అశిష్‌లు మంచంపై చనిపోయి కనిపించారు’ అని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనను అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్టుగా పోలీసులు చెప్పారు. నిజామాబాద్ నుంచి వారి బంధువులు వచ్చిన తర్వాత వారి నుంచి సమాచారం సేకరించి విచారణను కొనసాగిస్తామని తెలిపారు.