MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. అవమానిస్తోందని, దూరం పెడుతోందని అక్కసుతో హత్య.. రైలు పట్టాలపై ఆత్మహత్మ..

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. అవమానిస్తోందని, దూరం పెడుతోందని అక్కసుతో హత్య.. రైలు పట్టాలపై ఆత్మహత్మ..

వివాహేతరసంబంధం పెట్టుకున్న ప్రియురాలు తనను నిర్లక్ష్యం చేస్తుందని ఓ వ్యక్తి మనస్తాపం చెందాడు. చులకనగా చూస్తుందని బాధపడ్డాడు. చివరికి ఆమెను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. 

3 Min read
Author : Bukka Sumabala
Published : Aug 29 2023, 09:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఏలూరు : ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఓ ఆత్మహత్య, మహిళ హత్య సోమవారం నాడు కలకలం రేపింది. రక్తపు మడుగులో పడి ఉన్న సుజాత అనే మహిళ తాళం వేసి ఉన్న ఇంట్లో కనిపించడం తీవ్ర భయాందోళనలు  కలిగించింది. అయితే, సుజాత హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. ఏలూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే ఏలూరు దక్షిణపు వీధి అశోక ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో సుజాత అనే మహిళ హత్యకు గురైంది.

నిందితులు ఆమెని కత్తితో పీక కోసి చంపేశారు. ఇది స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. వెంటనే సమాచారం అందడంతో వన్ టౌన్ సిఐ రాజశేఖర్ ఆదేశాల మేరకు ఎస్సై రామకృష్ణ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలిని నగర శివారులో ఉండే శనివారపేటకు చెందిన ఉడతా సుజాత (30)గా గుర్తించారు. 

27

పంచనామ నిర్వహించిన తర్వాత.. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది?  వచ్చింది??  ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు..  దీంతో ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమైన విషయం బయటపడింది. ఆ ఇల్లు దిమ్మిటి సత్యనారాయణ (40) అనే వ్యక్తిది.  అతని ఇంట్లో సుజాత ఎందుకు చనిపోయింది? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

అయితే దిమ్మిటి సత్యనారాయణకు వివాహమై భార్యతో విడిపోయి ఐదేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. అతను పెయింటింగ్ పనులు చేస్తుండేవాడు. గత నాలుగేళ్లుగా సుజాతతో ఆయనకు పరిచయమై ఇద్దరు సన్నిహితంగా ఉంటున్నారు. ఆమె అప్పుడప్పుడు వచ్చి వెళుతుండదని స్థానికులు చెప్పారు. దీంతో పోలీసులకు అసలు విషయం అర్థమైంది.

37

సోమవారం నాడు దిమ్మిటి సత్యనారాయణ మృతదేహం రైలు పట్టాలపై దొరికింది. దీంతో సుజాత హత్య విషయం వెలుగు చూసింది. ఆదివారం రాత్రి సుజాత సత్యనారాయణ ఇంటికి వచ్చింది. సుజాత తనను దూరం పెడుతోందని, అవమానిస్తోందన్న కోపంతో సత్యనారాయణ సుజాత మెడ కోసి చంపేశాడు. సోమవారం ఉదయం ఆమెను ఇంట్లోనే వదిలేసి ఇంటికి తాళం వేసి… టూ వీలర్ పై బయటకు వెళ్ళాడు. 

47

పోలీసులకు దొరికిపోతానని భయపడ్డాడు. నూజివీడు సమీపంలోకి వచ్చాక రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్ కింద తన బండిని ఆపాడు.  అక్కడే బండిని పార్క్ చేసి రైలు పట్టాలమీదికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైలు పట్టాల మీద ఎవరిదో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి పరిశీలించగా అది సత్యనారాయణదిగా తేలింది. అతని జేబులో ఓ చీటీపై పేరు, చిరునామా రాసి ఉంది.

57

పార్కు చేసి ఉన్న టు వీలర్ ని, మృతుడి జేబులో ఉన్న ఫోన్ ను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో సత్యనారాయణ సూసైడ్ నోట్లో రాశాడు. అందులో..  గత నాలుగేళ్లుగా సుజాత తనకు తెలుసని.. కానీ గత కొద్ది రోజులుగా దూరం పెడుతుందని రాసుకొచ్చాడు. తాను ఆమెను నమ్మి తాళి కూడా కట్టానని,  కొద్ది రోజులుగా తనని అవమానిస్తుందని చెప్పుకొచ్చాడు.

ఈ నేపథ్యంలోనే ఆమెని చంపేయాలని నిర్ణయించుకుని ఆదివారం రాత్రి ఇంటికి పిలిపించానని..  ఆ తర్వాత ఆమె గొంతు కోసి చంపేశానని పేర్కొన్నారు. ఈ సూసైడ్ నోట్ పోలీసులకు సత్యనారాయణ ఇంట్లో దొరికింది. అయితే ముందుగా సత్యనారాయణ చనిపోయిన విషయం రైల్వే పోలీసులు బంధువులకు తెలిపారు. దీంతో వారు ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో సుజాత మృతదేహం కనిపించింది.

67

అలా హత్య,  ఆత్మహత్య విషయాలు వెలుగు చూసాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి తాళాలు పగలగొట్టిన పోలీసులకు లోపల రక్తపు మడుగులో సుజాత మృతదేహం దాని పక్కనే కత్తి కనిపించాయి.  ఆ పక్కనే కిటికీలో సూసైడ్ నోట్ దొరికింది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ సుజాత ఎవరు అని అనుమానాలు తలెత్తాయి.

77

శనివారం పేటలో ఉండే సుజాతకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు.  భర్త లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సత్యనారాయణ, సుజాత భర్త స్నేహితులు. అలా సత్యనారాయణకు సుజాతతో పరిచయం ఏర్పడింది. భర్త ఊర్లో లేనప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు సత్యనారాయణ ఇంటికి వెళుతుండేది. ఈ ఘటన జరిగిన సమయంలో సుజాత భర్త లారీ డ్రైవర్గా భోపాల్ కు వెళ్ళాడు. అతడికి హత్య సమాచారాన్ని అందించారు. సుజాతకు సత్యనారాయణకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమి ప్రాథమికంగా గుర్తించారు. అయితే, ఆమెను ఎందుకు చంపాల్సి వచ్చింది అనేదానిపై విచారణ చేస్తున్నారు పోలీసులు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
3వ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపైUnion Minister Chandra Sekhar Pemmasani Speech | Asianet News Telugu
Recommended image2
Now Playing
3వ ప్రపంచ తెలుగు మహాసభలు | Ayyannapatrudu Chintakayala Powerful Speech | Asianet News Telugu
Recommended image3
Now Playing
సొంపేట స్టేషన్‌లో రైలు పైకెక్కిన యువకుడు: BBS–TPT Superfast Express at Sompeta | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved