అయ్యన్నపాత్రుడు కుటుంబంలో రచ్చ: వైసీపీలోకి తమ్ముడు, జగన్ గ్రీన్ సిగ్నల్

First Published Oct 7, 2019, 1:29 PM IST

తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉంటున్న అయ్యన్నపాత్రుడికి తమ్ముడు గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. సన్యాసిపాత్రుడు వైసీపీలోకి చేరితే అయ్యన్న ఇమేజ్ కాస్త డామేజ్ అయ్యే పరిస్థితి ఉందని నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. 
 
విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్గీలో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన ఏం మాట్లాడినా సన్సేషనే. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన రూటే సెపరేటు. అధికార పార్టీలో ఉంటూనే మరోమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలా విశాఖపట్నం జిల్లా రాజకీయాల్లో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న తరుణంలో ఆయనకు గొప్ప షాక్ ఇచ్చారు సోదరుడు. తమ్ముడు ఇచ్చిన స్ట్రోక్ తో ఏం చేయాలో దిక్కుతోచక తల పట్టుకుంటున్నారు ఆ సీనియర్ రాజకీయ నాయకుడు.

ఇంతకీ ఆ సీనియర్ నేత ఎవరు, అంత తలనొప్పి తెచ్చిపెట్టిన తమ్ముడు ఎవరో తెలుసుకుకోవాలనుకుంటున్నారా.....ఇంకెవరు మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. తలనొప్పి తెచ్చిపెడుతుంది తమ్ముడు సన్యాసి పాత్రుడు.

వాస్తవానికి అయ్యన్నపాత్రుడు ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడుకు ఏనాడు పొసగలేదు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్నప్పటికీ సన్యాసిపాత్రుడు అంతగా పట్టించుకోలేదు. తాను మంత్రి సోదరుడుని అని ఏనాడు చెప్పుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఇద్దరి మధ్య మాటల్లేవ్.

అంతేకాదు ఏ బహిరంగ వేదిక అయినప్పటికీ అయ్యన్నపాత్రుడు, సన్యాసపాత్రుడు ఎడమెుహం, పెడమెుహం పెట్టుకునే ఉండేవారు. ఒకరినొకరు పలకరించుకునేవారు కాదు. వేదిక పంచుకున్నప్పటికీ ఆయన పని ఆయనదే ఈయన పని ఈయనదే అన్నట్లు ఉండేది.

మంత్రిగా అయ్యన్నపాత్రుడు ఉన్న సమయంలో తమ్ముడు సన్యాసిపాత్రుడు దూరంగా ఉండటంతో ఆ ప్లేస్ ను అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ భర్తీ చేశారు. నియోజకవర్గంలో హల్ చల్ చేశారు.  నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో విజయ్ హల్ చల్ చేయడంతో సన్యాసిపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పటికే అయ్యన్నపాత్రుడు, సన్యాసిపాత్రుడల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేది. విజయ్ ఆరంగేట్రంతో అది కాస్త మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్ గా సన్యాసిపాత్రుడు భార్య అనిత వ్యవహరిస్తుండగా, సన్యాసి పాత్రుడు వైస్ చైర్మన్ గా ఉన్నారు.

తన మున్సిపాలిటీ పరిధిలో వేలుపెట్టొద్దంటూ విజయ్ ను పలుమార్లు పరోక్షంగా హెచ్చరించారు. ఆనాటి నుంచి సన్యాసిపాత్రుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే తెలుగుదేశం పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని సన్యాసిపాత్రుడుని బుజ్జగించడంతో వెనక్కితగ్గారు.

అయితే తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విబేదాలు, తన రాజకీయ భవిష్యత్ నేపథ్యంలో ఆయన ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. విశాఖపట్నంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన జరుగుతున్న సమయంలో, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు జన్మదినోత్సవం రోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.

తెలుగుదేశం పార్టీకి సన్యాసిపాత్రుడు రాజీనామా చేయడంతో ఆయన వైసీపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైసీపీలో చేరే అంశంపై సీఎం జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. జగన్ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో వైసీపీలో చేరే అంశం పెండింగ్ లో పడింది.

అయితే సన్యాసిపాత్రుడు తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సీఎం జగన్ తో చర్చించినట్లు తెలుస్తోంది. దాంతో సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.

ఈనెల 6న తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో సన్యాసిపాత్రువు వైసీపీ కండువా కప్పుకోవాల్సి ఉంది. అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనతో బిజీబిజీగా ఉండటంతో అది కుదరలేదు. ఈ వారంలో సన్యాసిపాత్రుడు వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

మెుత్తానికి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉంటున్న అయ్యన్నపాత్రుడికి తమ్ముడు గట్టి షాక్ ఇచ్చారనే చెప్పాలి. సన్యాసిపాత్రుడు వైసీపీలోకి చేరితే అయ్యన్న ఇమేజ్ కాస్త డామేజ్ అయ్యే పరిస్థితి ఉందని నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు.

మెుత్తానికి అన్నయ్య మీద కోపం, అన్నయ్య కొడుకు విజయ్ ఆధిపత్య పోరును తట్టుకోలేకే సన్యాసిపాత్రుడు వైసీపీలో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంతేకాదు సన్యాసిపాత్రుడుపై ఆయన కుటుంబ సభ్యులే తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇక టీడీపీలో ఉండలేక వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?