MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Tirumala: తిరుమ‌ల‌లో భారీగా త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ.. అస‌లు కార‌ణం ఏంటంటే.?

Tirumala: తిరుమ‌ల‌లో భారీగా త‌గ్గిన భ‌క్తుల ర‌ద్దీ.. అస‌లు కార‌ణం ఏంటంటే.?

నిత్యం వేలాది మంది భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడే క‌లియు వైకుంఠం తిరుమ‌ల‌లో ప్ర‌స్తుతం భ‌క్తుల ర‌ద్దీ త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తోంది. సాధారణంగా వేస‌విలో భ‌క్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతుంటారు. కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితి దానికి భిన్నంగా ఉంది. దీనికి అస‌లు కార‌ణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..   

2 Min read
Narender Vaitla
Published : May 12 2025, 07:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావ‌ర‌ణం తిరుమ‌ల‌పై స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో భ‌క్తులు ప్ర‌యాణాన్నివాయిదా వేసుకుంటున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. వేసవి సెలవులు ఉన్న‌ప్ప‌టికీ క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో, ముఖ్యంగా పరీక్షల ఫలితాల అనంతరం, పెద్దఎత్తున భక్తులు తిరుమలకు వస్తూ ఉండేవారు.
 

25
Asianet Image


గతేడాది మే 1 నుండి 10 తేదీల మధ్య 7,04,760 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, ఈ ఏడాది అదే కాలంలో 7,04,689 మంది భక్తులు దర్శించుకున్నారు. సంఖ్యలో తేడా లేకపోయినప్పటికీ, క్యూలైన్లు పెద్దగా కనిపించకపోవడం గ‌మ‌నార్హం. 

టీటీడీ అధికారులు తెలిపిన ప్రకారం, కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి, దేశవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ భయాలు భక్తుల రద్దీపై ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. తిరుమల రద్దీ ప్రాంతం కావడంతో, చాలా మంది భక్తులు పరిస్థితి స్థిరపడిన తర్వాతే స్వామివారి దర్శనానికి రావాలనుకుంటున్నట్టు సమాచారం.  

Related Articles

Murali Naik: దేశ రక్షణలో ప్రాణత్యాగం.. మురళి నాయక్ కుటుంబానికి ఏపీ సర్కారు అండ.. రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా
Murali Naik: దేశ రక్షణలో ప్రాణత్యాగం.. మురళి నాయక్ కుటుంబానికి ఏపీ సర్కారు అండ.. రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా
 Operation Sindoor: భారత్ కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది?
Operation Sindoor: భారత్ కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది?
35
Tirumala

Tirumala

ఈ నెల 1, 2 తేదీలను తప్పిస్తే మిగతా రోజుల్లో కంపార్టుమెంట్లు పూర్తిగా నిండకపోవడంతో, భక్తులు 7 నుంచి 12 గంటల వ్యవధిలోనే దర్శనాన్ని పూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్లో మార్ప‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ వారంలో భ‌క్తుల సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

45
Andhra Pradesh- 15 hour darshan for common pilgrims says TTD

Andhra Pradesh- 15 hour darshan for common pilgrims says TTD

భద్రతా బలగాల మాక్ డ్రిల్‌: 

ఇదిలా ఉంటే తాజాగా భక్తులకు భద్రత కల్పించేందుకు తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం-3 వద్ద శనివారం భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. భక్తులు, స్థానికుల్లో భరోసా కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశంగా తిరుమల డీఎస్పీ విజయ్ శేఖర్ తెలిపారు. 

55
Tirumala

Tirumala

అలాగే తిరుమల భద్రతను దృష్టిలో పెట్టుకొని, తిరుపతి పరిధిలో డ్రోన్ల వినియోగంపై పోలీసు శాఖ ఆంక్షలు విధించింది. డ్రోన్లు ఉపయోగించాలంటే ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాలని, ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పదంగా డ్రోన్ వాడటం గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

About the Author

Narender Vaitla
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
తిరుపతి
ఆంధ్ర ప్రదేశ్
యుద్ధం
 
Recommended Stories
Andhra Pradesh: ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే బంపరాఫర్.. భారీగా తగ్గిన బస్ ఛార్జీలు ..
Andhra Pradesh: ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే బంపరాఫర్.. భారీగా తగ్గిన బస్ ఛార్జీలు ..
Andhra Pradesh విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌..ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 25 లక్షలు..!
Andhra Pradesh విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌ న్యూస్‌..ఒక్కొక్కరికి 15 లక్షల నుంచి 25 లక్షలు..!
Inspiring Story : కేవలం రూ.6 కే 80 కి.మీ ప్రయాణం.. సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చిన తెలుగు కుర్రాడు
Inspiring Story : కేవలం రూ.6 కే 80 కి.మీ ప్రయాణం.. సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చిన తెలుగు కుర్రాడు
Top Stories
Air India Plane Crash - అమెరికా చెప్పినట్లు చేస్తే... అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగేది కాదేమో?
Air India Plane Crash - అమెరికా చెప్పినట్లు చేస్తే... అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగేది కాదేమో?
Telugu Cinema News Live: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్,  పవర్ స్టార్ OG నుంచి సాలిడ్ అప్ డేట్
Telugu Cinema News Live: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, పవర్ స్టార్ OG నుంచి సాలిడ్ అప్ డేట్
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవి ప్రసాదం.. తండ్రి, భర్తకు సంపద మోసుకొస్తారు..!
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు లక్ష్మీదేవి ప్రసాదం.. తండ్రి, భర్తకు సంపద మోసుకొస్తారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved