MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఏపీని నంబర్‌ 1గా నిలపడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నిర్ణయం.. టాటా ఛైర్మన్‌తో భేటీలో కీలక అంశాలపై చర్చ

ఏపీని నంబర్‌ 1గా నిలపడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నిర్ణయం.. టాటా ఛైర్మన్‌తో భేటీలో కీలక అంశాలపై చర్చ

పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులు ఈ టాస్క్ ఫోర్స్‌లో ఉండనున్నారు.

1 Min read
Author : Galam Venkata Rao
| Updated : Aug 16 2024, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Chandra Babu

Chandra Babu

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ శుక్రవారం భేటీ అయ్యారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో పట్టుబడుల అంశంపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపైనా సమావేశంలో చర్చ జరిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Chandra Babu

Chandra Babu

విశాఖలో టీసీఎస్‌ డెవల్మెంట్ సెంటర్ ఏర్పాటుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ లైన్స్ విస్తరణ అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలో సోలార్, టెలీ కమ్యునికేషన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుపైనా చర్చించారు.

33
Chandra Babu

Chandra Babu

పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. 

ఈ టాస్క్‌ పోర్స్‌లో సీఎం నారా చంద్రబాబు నాయుడు చైర్మన్‌గా ఉంటారు. టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ కో- చైర్మన్‌గా టాస్క్ ఫోర్స్ ఉంటారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్‌ స్టేట్ చేసే లక్ష్యంతో విజన్- 2047 రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇందులో భాగంగా పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. అమరావతిలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామి కానుంది. 

About the Author

GV
Galam Venkata Rao
వెంకట్ 8 సంవత్సరాలకు పైగా ప్రింట్, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాల్లో అనుభవం కలిగిన జర్నలిస్ట్. ఈనాడులో జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో వీడియో - సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Recommended image2
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?
Recommended image3
Weather Update: పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved