తమ్ముడు పవన్ పోరు: చిరంజీవికి వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ దొరికేనా?
First Published Oct 10, 2019, 12:54 PM IST
సినీ నటుడు చిరంజీవి ఏపీ సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.వీరిద్దరి మధ్య భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తావిస్తోంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మాజీ కేంద్ర మంత్రి చిరంజీవికి అపాయింట్‌మెంట్ ఇస్తారా లేదా అనే ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. చిరంజీవి సోదరుడు ప్రజా రాజ్యం చీఫ్ పవన్ కళ్యాణ్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో చిరంజీవి మాత్రం జగన్ అపాయింట్ మెంట్ కోరడం రాజకీయంగా ప్రాధాన్యతను కలిగిస్తోంది.

చారిత్రక నేపథ్యంలో ఉన్న సైరా సినిమాలో చిరంజీవి నటించారు. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రత్యేక షో వేసి సీఎం జగన్ కు చూపించాలని చిరంజీవి భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ కారణంగానే జగన్ అపాయింట్‌మెంట్ కోసం చిరంజీవి ప్రయత్నించినట్టుగా ప్రచారం సాగుతోంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?