70 ఏళ్లలో కూడ ఫిట్‌: బాబు ఆరోగ్య రహస్యమిదే

First Published 15, May 2019, 1:44 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిట్‌గా ఉండడానికి ఆయన తీసుకొనే ఆహరమే కారణంగా వైద్యులు చెబుతుంటారు.చాలా కాలంగా చంద్రబాబునాయుడు ప్రత్యేక ఆహారపు అలవాట్లకు  మాత్రమే పరిమితమయ్యారు. 

ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీకి చంద్రబాబునాయుడుకు 70 ఏళ్లు వచ్చాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 62 ఏళ్ల వయస్సులో చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. ఆ వయస్సులో కూడ చిన్న ఇబ్బంది లేకుండా బాబు పాదయాత్ర నిర్వహించడానికి బాబు ఆరోగ్య అలవాట్లే కారణంగా పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1995 లో చంద్రబాబునాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయం నుండి చంద్రబాబునాయుడు  ప్రత్యేకమైన ఆహార అలవాట్లను అలవర్చుకొన్నాడు. ఆనాటి నుండి బాబు తన ఆహార అలవాట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ అలవాట్లను తప్పకుండా పాటిస్తారు.

ప్రతి రోజూ చంద్రబాబు మెనూలో ఏ రకమైన భోజనం వండాలి... ఏ మేరకు ఏ వంటకాల్లో  ఏయే పదార్థాలు ఉండాలనే విషయమై ప్రత్యేకమైన చార్ట్ ఉంటుంది. ఈ చార్ట్ ప్రకారంగానే వంటలో ఉపయోగించాలి. కూరలో ఒక్క గ్రాము నూనె లేదా ఇతర పదార్థాలు వేయరు.  ఈ చార్ట్ మేరకే వంటలను  తయారు చేస్తారు.

ఈ ఆహారపు అలవాట్ల కారణంగానే  చంద్రబాబునాయుడు ఫిట్‌గా ఉంటారని పార్టీ నేతలు చెబుతారు. రుచి కోసం ఆయన భోజనం చేయరు. జీవించడం కోసమే ఆయన భోజనం తీసుకొంటారు. చంద్రబాబునాయుడు కుర్రాడి మాదిరిగా పనిచేయడానికి ఆహారపు అలవాట్లతో పాటు ప్రతి రోజూ యోగా చేయడం కూడ కారణంగా పార్టీ వర్గాలు చెబుతాయి.

చంద్రబాబునాయుడు ప్రతి రోజూ ఉదయం లేవగానే యోగాతో పాటు వ్యాయామం చేస్తారు. ఆ తర్వాత ఆయన ఆ రోజు దినపత్రికలు చదువుతారు. దినపత్రికలు చదవిన తర్వాత  స్నానం చేసి అల్పాహారం తీసుకొంటారు.

అల్పాహారంలో రాగి, జొన్న, సజ్జలతో కలిపిన జావను తీసుకొంటారు. దీంతో పాటు ఓ ఆమ్లెట్ తీసుకొంటారు. ఈ ఆమ్లెట్‌లో కూడ కోడిగుడ్డులోని పచ్చసొన లేకుండా జాగ్రత్తలు తీసుకొంటారు. దీనికి తోడు సీజనల్ ప్రూట్ కూడ అల్పాహరంలో ఉంటుంది.

అల్పాహారంలో ప్రతి రోజూ ఒక్కో రకమైన వెరైటీ ఉండేలా ప్లాన్ చేస్తారు. అయితే అల్పాహరంలో మాత్రం రాగి, జొన్న, సజ్జలతో కూడ వంటకాలు ఉంటాయి. మధ్యాహ్నాం పూట రాగి, జొన్నలతో కూడిన భోజనం ఉంటుంది.

ఈ భోజనంలో ఓ కూర తప్పనిసరి ఉంటుంది. అయితే కప్పు మాత్రమే తింటాడు.కప్పు భోజనం, కర్రీ కూడ కప్పు మాత్రమే ఉంటుంది.రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకొంటారు. లేదా పాలు తీసుకొని నిద్రపోతారు.ఒకవేళ రాత్రిపూట 12 గంటల తర్వాత కూడ పార్టీ సమావేశాలు లేదా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తే ఓ గ్టాస్ పాలు తాగుతారు.

చాలా కాలంగానే చంద్రబాబుు  నాన్‌వెజ్ మానేశాడు. చికెన్, మటన్‌ జోలికి వెళ్లరు. వారంలో ఒక్క పూట మితంగానే రైస్ తీసుకొంటారు. రైస్ కూడ కప్పు కంటే ఎక్కువంగా ఉండదు. చంద్రబాబునాయుడు 2014 ఎన్నికలకు ముందుగా ఒక్కసారి కళ్లు చెక్ చేయించుకొన్నారు. ఆ సమయంలో ఆయనకు డాక్టర్లు అద్దాలు సిపారసు చేశారు. అంతేకాదు చేపలు తినాలని  కూడ డాక్టర్లు సూచించారు. దీంతో వారంలో ఒక్క సారి చేపలు తినడం అలవాటు చేసుకొన్నారు.

చంద్రబాబుకు వంటలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక వంట మనుషులు ఉంటారు.చంద్రబాబుకు ఏ రోజు ఏ వంట చేయాలనే దానిపై చంద్రబాబునాయుడు ఇంటి నుండి సమాచారం వస్తోంది. ఈ సమాచారం ఆధారంగానే బాబుకు వంటను తయారు చేస్తారు. బాబు పాదయాత్రలో ఎక్కువగా ఇలానే పాటించేవారు.చంద్రబాబునాయుడు ఎక్కడికైనా టూరుకు వెళ్తే తన వెంట వంట మనిషిని తీసుకెళ్తారు. ప్రతి రోజూ చంద్రబాబు నాయుడు వ్యాయామం చేస్తారు.

loader