ఆస్తుల కేసు: జగన్ కు వ్యక్తిగత మినహాయింపుపై సిబిఐ పిటిషన్ వెనక
First Published Oct 3, 2019, 8:37 PM IST
దేవీపట్నం పడవ ప్రమాదం, బతుకమ్మ సంబరాలు, గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాల హడావిడిలో అత్యంత ప్రాధాన్యత గల ఒక వార్తకు మీడియాలో అనుకున్నంత హైప్ రాలేదు.

దేవీపట్నం పడవ ప్రమాదం, బతుకమ్మ సంబరాలు, గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాల హడావిడిలో అత్యంత ప్రాధాన్యత గల ఒక వార్తకు మీడియాలో అనుకున్నంత హైప్ రాలేదు. అదే అక్రమాస్తుల కేసు విచారణలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు. ఆయనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటంతో పాటు పరిపాలనలో తీరిక లేనందున తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కావాలంటూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సీబీఐ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది. జైలులో ఉన్నప్పుడే జగన్ సాక్షులను ప్రభావితం చేయగలిగారన్న దర్యాప్తు సంస్థ ఇప్పుడు ఆయనకు ఆ అవకాశం ఇవ్వొద్దంటూ వాదిస్తోంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?