MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో రిషి సునాక్ తల్లిదండ్రుల పూజలు (ఫొటోలు)

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో రిషి సునాక్ తల్లిదండ్రుల పూజలు (ఫొటోలు)

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు.

1 Min read
Author : Sumanth K
| Updated : Sep 13 2023, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు. రిషి సునాక్ తల్లిదండ్రులు యశ్వీర్, ఉషా సునాక్‌లతో ఆయన  అత్త సుధా మూర్తి కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి వచ్చారు. వారంతా ఆలయంలో ప్రత్యేక పూజలు  చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మంత్రాలయంలో శ్రీరాఘవేంద్రస్వామిని దర్శనం చేసుకున్న అనంతరం.. పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి మంత్రాలయం నుంచి ప్రసాదం, మంత్రాక్షం ఇచ్చి ఆశీస్సులు అందజేశారు.

36

ఈ విషయాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో బుధవారం వెల్లడించింది. ‘‘ఈరోజు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తల్లిదండ్రులు యశ్వీర్ సునాక్‌, ఉషా సునాక్ మంత్రాలయాన్ని సందర్శించారు. వారి వెంట ఇన్ఫోసిస్‌ సుధా నారాయణ మూర్తి ఉన్నారు. వారంతా కలిసి శ్రీ రాయారు దర్శనం చేసుకున్నారు. వారి సందర్శన సమయంలో శ్రీ స్వామీజీ వారికి వస్త్రం, ఫల మంత్రాక్షతే, జ్ఞాపికతో తన ఆశీర్వాదాన్ని అందించారు.’’ అని పోస్టులో పేర్కొంది. 

46

ఇక, బ్రిటన్ వెళ్లిన తర్వాత రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులకు కూడా ప్రసాదం అందజేయమని యశ్వీర్ సునాక్‌, ఉషా సునాక్‌లకు మంత్రాలయం పీఠాధిపతి తెలిపారు. 

56

ఇక, జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన సమయంలో.. తన భారతీయ మూలాలు, భారత్‌తో తనకున్న సంబంధాల గురించి చాలా గర్వపడుతున్నట్లు రిషి సునాక్ చెప్పారు. రిషి సునక్, అక్షతా మూర్తి దంపతులు ఆదివారం న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని కూడా సందర్శించారు.
 

66
Rishi Sunak

Rishi Sunak

రిషి సునాక్ గతేడాది బ్రిటన్ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక, రిషి సునాక్ తల్లిదండ్రులు గతేడాది వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు.

About the Author

SK
Sumanth K
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కర్నూలులో జగన్ మానియా.. కాన్వాయ్ వెనక పరుగులు తీసిన ఫ్యాన్స్ | YS Jagan Kurnool Tour | YSRCP
Recommended image2
Now Playing
కర్నూలులో అడుగుపెట్టిన జగన్.. సీఎం సీఎం అంటూ ఘన స్వాగతం | YS Jagan KurnoolTour | Busine Virupakshi
Recommended image3
ఇక అమరావతికి జెట్ స్పీడ్ తో వెళ్లొచ్చు.. అసలేంటీ సీడ్ యాక్సెస్ రోడ్డు.? దీంతో కలిగే ప్రయోజనాలేంటి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved