టీడీపీలో చేరికకు ఎస్‌సీవీ నాయుడు యత్నం: వ్యతిరేకిస్తున్న బొజ్జల
టీడీపీలో ఎస్‌సీవీ నాయుడు చేరిక ఆ పార్టీలో కలకలం రేపుతుంది. టీడీపీ శ్రీకాళహస్తి ఇంచార్జీ బొజ్జల సుధీర్ రెడ్డి ఎస్‌సీవీ నాయుడు చేరికను వ్యతిరేకిస్తున్నారు.
టీడీపీలో చేరికకు ఎస్‌సీవీ నాయుడు యత్నం: వ్యతిరేకిస్తున్న బొజ్జల
టీడీపీలో చేరేందుకు ఎస్‌సీవీ నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు సమక్షంలో ఎస్‌సీవీ నాయుడు టీడీపీ తీర్ధం పుచ్చుకోవాల్సి ఉంది. అయితే ఎస్‌సీవీ నాయుడు టీడీపీలో చేరికను టీడీపీ శ్రీకాళహస్తి ఇంచార్జీ బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఇవాళ ఎస్‌సీవీ నాయుడు టీడీపీలో చేరిక నిలిచిపోయింది.
టీడీపీలో చేరికకు ఎస్‌సీవీ నాయుడు యత్నం: వ్యతిరేకిస్తున్న బొజ్జల
2019 ఎన్నికలకు ముందు ఎస్‌సీవీ నాయుడు టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరారు 2019 లో శ్రీకాళహస్తి టిక్కెట్టు తనకు వస్తుందని ఎస్‌సీవీ నాయుడు భావించారు. కానీ ఎస్‌సీవీ నాయుడికి కాకుండా బొజ్జల సుధీర్ రెడ్డికి టీడీపీ టిక్కెట్టు ఇచ్చింది. దీంతో ఎస్‌సీవీ నాయుడు టీడీపీని వీడారు.
టీడీపీలో చేరికకు ఎస్‌సీవీ నాయుడు యత్నం: వ్యతిరేకిస్తున్న బొజ్జల
ఎస్‌సీవీనాయుడికి వైఎస్ఆర్‌సీలో స్థానిక ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డితో పొసగడం లేదు. దీంతో వైఎస్ఆర్‌సీపీని వీడాలని ఎస్‌సీవీ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. టీడీపీ నాయకత్వం కూడ ఎస్‌సీవీ నాయుడు చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్‌సీవీ నాయుడు టీడీపీలో చేరికను బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
టీడీపీలో చేరికకు ఎస్‌సీవీ నాయుడు యత్నం: వ్యతిరేకిస్తున్న బొజ్జల
ఎస్‌సీవీ నాయుడు టీడీపీ చేరిక కార్యక్రమంలో టీడీపీ క్యాడర్ ఎవరూ పాల్గొనవద్దని బోజ్జల సుధీర్ రెడ్డి కోరారు. ఈ మేరకు టీడీపీ శ్రేణులకు నిన్న ఆడియో సందేశం పంపారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఎస్‌సీవీ నాయుడు చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున టీడీపీ నాయకత్వం నష్టనివారణ చర్యలకు దిగింది.
టీడీపీలో చేరికకు ఎస్‌సీవీ నాయుడు యత్నం: వ్యతిరేకిస్తున్న బొజ్జల
ఎస్‌సీవీ నాయుడు టీడీపీలో చేరికను వాయిదా వేసింది. ఈ నెల 14 వతేదీన కుప్పం రావాలని చంద్రబాబు బొజ్జల సుధీర్ రెడ్డి, ఎస్‌సీవీ నాయుడికి సమాచారం పంపారు. ఈ ఇద్దరు నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.
టీడీపీలో చేరికకు ఎస్‌సీవీ నాయుడు యత్నం: వ్యతిరేకిస్తున్న బొజ్జల
2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేయలేదు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కి బదులుగా బొజ్జల సుధీర్ రెడ్డికి టీడీపీ టిక్కెట్టు కేటాయించింది. ఆ ఎన్నికల్లో బొజ్జల సుధీర్ రెడ్డి ఓటమి పాలయ్యాడు.