ప్రత్యేక హోదాపై బిజెపి ట్విస్ట్: జగన్ కు గాలం

First Published 14, May 2019, 8:33 AM IST

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతును సంపాదించుకునే వ్యూహంలో భాగంగా బిజెపి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బిజెపి నాయకత్వం గాలం వేస్తోంది. 

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతును సంపాదించుకునే వ్యూహంలో భాగంగా బిజెపి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బిజెపి నాయకత్వం గాలం వేస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆయనను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది

తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి నాయకులు ఇప్పటికే జగన్ కు ఫీలర్లు పంపినట్లు తెలుస్తోంది. కేంద్రంలో హంగ్ లోకసభ వస్తుందనే అంచనాలతో బిజెపి ఓ వైపు, కాంగ్రెసు మరో వైపు ప్రాంతీయ పార్టీలను బుజ్జగించే ప్రయత్నాల్లో పడ్డాయి

తెలుగుదేశం పార్టీ దాదాపు నాలుగేళ్లు మద్దతుగా నిలిచినప్పటికీ బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఎ) ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ స్థితిలో ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ తన గొంతును పెంచారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే ఎత్తుగడలో భాగంగా తన పార్లమెంటు సభ్యులతో రాజీనామాలు చేయించారు

ప్రత్యేక హోదా కోసం తొలుత డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చివరకు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. ప్రత్యేక హోదా అనేది సెంటిమెంటుగా మారి, ప్రజా వ్యతిరేకత పొడసూపడంతో చంద్రబాబు తన వైఖరిని మార్చుకున్నారు. ప్రత్యేక హోదాకు పట్టుబడుతూ చివరకు ఎన్డీఎతో తెగదెంపులు చేసుకున్నారు

ఎన్డీఎకు వెలుపల ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం బిజెపి తాజాగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే జగన్ ను తమ వైపు లాక్కునే ప్రయత్నాలను సాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 సీట్లు ఉండగా, జగన్ 20 సీట్లు గెలుస్తారనే అంచనా సాగుతోంది. దానివల్ల కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్ కీలకమవుతారని బిజెపి నాయకులు భావిస్తున్నారు

ఫణి తుఫాను వల్ల జరిగిన నష్టం నేపథ్యంలో తమ రాష్ట్రానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ప్రత్యేక హోదా కోరుతున్నారు. ఒడిశాలో 21 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ 20 సీట్లు గెలుచుకుంది. బిజెపికి మద్దతు ఇవ్వడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే షరతును నవీన్ పట్నాయక్ పెట్టే అవకాశం ఉంది

ఎపికి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికి కేంద్రంలో తాను మద్దతు ఇస్తానని జగన్ స్పష్టంగా చెప్పారు. ఎపి, ఒడిశాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అంగీకరిస్తే బిజెపికి దాదాపు 40 మంది లోకసభ సభ్యుల మద్దతు లభించే అవకాశం ఉంది

ఎపికి బిజెపి ప్రత్యేక హోదా ఇస్తే తెలుగుదేశం పార్టీని రాజకీయంగా మరింతగా దెబ్బ తీసే అవకాశం జగన్ కు లభిస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని జగన్ తో పాటు బిజెపి రాష్ట్ర నాయకులు కూడా విమర్శించే అవకాశం ఉంది

ఫలితాలు వెలువడే వరకు నోరు విప్పకూడదని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయించుకోవచ్చునని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బిజెపికి ఆయన హామీ ఇవ్వడం లేదని తెలుస్తోంది

loader