ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌... పింగళి కూతురికి జగన్ ఆత్మీయ సత్కారం

First Published Mar 12, 2021, 4:26 PM IST

మాచర్ల: దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం జరుగుతోంది. 2022 నాటికి స్వాతంత్య్రం వచ్చి 75 యేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకలు జరగుతున్నాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించారు ఏపీ సీఎం జగన్‌. ఈ సందర్భంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సత్కరించారు. మాచర్లలో నివాసముంటున్న పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి నివాసానికి వెళ్లి ఆమెను సత్కరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. మాచర్లలో వైసిపి శ్రేణులు సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు.