ఏపీలో రోడ్డెక్కిన ఆర్టీసి బస్సులు... కరోనా పరీక్షల తర్వాతే విధుల్లోకి సిబ్బంది

First Published 21, May 2020, 10:37 AM

దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయిన ఆర్టీసి సర్వీసులు ఏపీలో తిరిగి ఇవాళ ప్రారంభమయ్యాయి.

విజయవాడ: లాక్  డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసి బస్సులు ఎట్టకేలకు ఇవాళ రోడ్డెక్కాయి. కేంద్ర ప్రభుత్వ సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, పల్లె వెలుగు బస్సులు తిరిగి ప్రయాణాన్ని మొదలెట్టాయి. ఏసీ, సిటీ బస్సులు ఇంకొన్నిరోజులు డిపోలకే పరిమితమవనున్నాయి.

ఇలా గురువారం ఉదయం నుండి రాష్ట్రవ్యాప్తంగా 436 రూట్లలో 1683 బస్సులు ప్రారంభమయ్యాయి. దీంతో రెండు నెలల తరువాత ఆర్టీసి ప్రయాణ ప్రాంగణాలు జనాలతో కళకళ లాడుతున్నాయి.

అయితే బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు కరోనా వ్యాప్తికి కారణమవకుండా ఆర్టీసి ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంది. బస్ స్టాండ్ లో మాస్క్ లు లేని ప్రయాణికులను అధికారులు హెచ్చరిస్తున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద కూడా భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. డ్రైవర్లు, ఇతర సిబ్బందిని పరీక్షలు చేసిన తరువాతే విధుల్లోకి అనుమతిస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజలు ఆర్టీసి సర్వీసులు ప్రారంభమవడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు బస్ స్టాండ్ లకు చేరుకుంటున్నారు. ఇలా విజయవాడ నుండి విశాఖ కు మొదటి సూపర్ లగ్జరీ బస్సు ఉదయమే బయల్దేరింది. దూర ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఆర్టీసీ అధికారులు విశాఖ, రాజమండ్రి, కాకినాడ లకు  బస్సు సర్వీసులను నడుపుతున్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ టికెట్ ఉంటేనే బస్ స్టాండ్ లోకి ప్రయాణికుల అనుమతిస్తున్నారు.

సుమారు 55 రోజుల నుంచి డిపోలకే పరిమితం కావటంతో దుమ్మెక్కిన బస్సులను బుధవారమే శుభ్రం చేయించిన అధికారులు ప్రయాణానికి సిద్దం చేశారు. అలాగే ప్రతీ బస్ స్టాండ్ లో శాని టైజర్ సిబ్బంది, ప్రయాణికులకు అందుబాటులో వుండే ఏర్పాట్లు చేశారు. ఇక బస్సులో కండక్టర్ ను పెడితే అతను ఒక సూపర్ స్ప్రెడర్ గా మారే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆన్ బోర్డ్ కండక్టర్ లేకుండానే బస్సులు నడుస్తున్నాయి.

క్రెడిట్, డెబిట్ కార్డులు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వేలెట్ ల ద్వారా టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పించారు. ఆన్లైన్ రిజర్వేషన్లు బుదవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చాయి. అయితే 65 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళు...10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసరమైతేనే (మెడికల్ ఎమెర్జెన్సీ) బస్సుల్లో ప్రయాణానికి అనుమతిస్తున్నారు ఆర్టీసి అధికారులు.

loader