- Home
- Andhra Pradesh
- Andhra Pradesh: ఏపీ స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే వార్త...ఒక్కొక్కరికి రూ. 6 వేలు...!
Andhra Pradesh: ఏపీ స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే వార్త...ఒక్కొక్కరికి రూ. 6 వేలు...!
ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు రూ.600 ప్రయాణ భత్యం, ఉచిత RTC బస్ పాస్‌లు, విద్యామిత్ర కిట్లు అందిస్తోంది.

విద్యామిత్ర కిట్లు
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల కోసం ప్రభుత్వం మరోమారు విద్యా రంగాన్ని అభివృద్ధి చేసే కీలక నిర్ణయాలు తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ప్రయాణ భత్యం, RTC బస్ పాస్‌లు, విద్యామిత్ర కిట్లు వంటి అనేక ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చింది.
10 నెలలకు రూ.6,000
ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తమ స్కూల్ ఇంటి నుంచి 1 కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో ఉంటే వారిని పాఠశాలకు తీసుకెళ్లే రవాణా ఖర్చుకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున, మొత్తం 10 నెలలకు రూ.6,000ను నేరుగా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ప్రణాళిక అమలులోకి వచ్చే విషయంపై జూలై 5న రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో చర్చించనున్నారు.
ఏ మార్పులు చేయబోతున్నారో
ఈ సమావేశంలో విద్యార్థుల విద్యాభివృద్ధి, గత ఏడాది వారి ప్రగతిపై సమీక్ష జరగనుంది. విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో మెరుగుదల చూపించారో, ఏ రంగాల్లో వెనుకబడ్డారో తెలుసుకుని తల్లిదండ్రులకు వివరించనున్నారు. అలాగే, ఈ ఏడాది ఏ మార్పులు చేయబోతున్నారో, ఏ కార్యక్రమాలను అమలు చేయబోతున్నారో కూడా తెలియజేయనున్నారు. తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు, సూచనలు సేకరించి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు.
‘నో బ్యాగ్ డే
పిల్లలపై భారం తగ్గించడమే లక్ష్యంగా శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’గా ప్రకటించారు. ఆ రోజు పిల్లలు పుస్తకాలు మోసుకెళ్లకుండా స్కూల్‌కు హాజరై సృజనాత్మక చర్చలు, ప్రాక్టికల్ యాక్టివిటీలతో నూతన విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించనున్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి మునుపటిలాగే గోధుమ రైస్ స్థానంలో సన్న బియ్యాన్ని అందించనుంది ప్రభుత్వం.
విద్యామిత్ర కిట్లు
విద్యార్థులకు సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే విద్యామిత్ర కిట్లు పంపిణీ చేసింది. ఈ కిట్లలో యూనిఫాం, షూస్, డిక్షనరీలు, బుక్స్ ఉన్నవి. చదువులో భారాన్ని తగ్గించేందుకు బుక్స్‌ను సెమిస్టర్ వారీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఒకేసారి భారీగా పుస్తకాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా విద్యార్థులకు సౌలభ్యం కలుగుతుంది.
ఉచిత బస్ పాస్
ఆర్టీసీ కూడా విద్యార్థులకు బస్సు పాస్ సౌకర్యాన్ని విస్తరించింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే 12 ఏళ్ల లోపు బాలురకు, 15 ఏళ్ల లోపు పదోతరగతి బాలికలకు ఉచిత బస్ పాస్ లభిస్తుంది. అంతేకాక, గ్రామీణ ప్రాంతాల్లో 20 కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం విద్యార్థులు హెడ్‌మాస్టర్ సంతకం, స్కూల్ సీల్ ఉన్న దరఖాస్తు ఫారంతో పాటు, ఆధార్ కార్డు, ఫోటో, రూ.70 రుసుముతో కూడిన ID కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది.
RTC బస్టాండ్ కౌంటర్‌లో
ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు నెలవారీ, త్రైమాసిక, అరవార్షిక, వార్షిక బస్ పాస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత పాస్ ఉన్నవారు పాస్‌ను నూతనీకరించుకోవచ్చు. బస్ పాస్ కోసం విద్యార్థులు స్థానిక RTC బస్టాండ్ కౌంటర్‌లో అప్లై చేయవచ్చు లేదా ఆన్‌లైన్‌లో buspassonline.apsrtconline.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. అయితే, విద్యార్థులు తమకు సమీపంలో ఉన్న RTC డిపో పరిధిలోనే అప్లై చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
మంచి ప్రోత్సాహం
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చర్యలన్నీ విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరగడానికి తోడ్పడేలా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ దూరంగా ఉండటం వల్ల పిల్లలు చదువు మానేస్తున్న నేపథ్యంలో రూ.600 ప్రయాణ భత్యం, RTC పాస్‌లు మంచి ప్రోత్సాహంగా మారతాయి.